క్వార్టర్స్‌లో సింధు, శ్రీకాంత్‌, ప్రణయ్‌

మలేసియా మాస్టర్స్‌ సూపర్‌ 500 టోర్నీలో భారత స్టార్‌ షట్లర్ల జోరు కొనసాగుతుంది. గురువారం పి.వి.సింధు, కిదాంబి శ్రీకాంత్‌, హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌లు క్వార్టర్‌ఫైనల్లో ప్రవేశించారు.

Published : 26 May 2023 01:50 IST

మలేసియా మాస్టర్స్‌

కౌలాలంపూర్‌: మలేసియా మాస్టర్స్‌ సూపర్‌ 500 టోర్నీలో భారత స్టార్‌ షట్లర్ల జోరు కొనసాగుతుంది. గురువారం పి.వి.సింధు, కిదాంబి శ్రీకాంత్‌, హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌లు క్వార్టర్‌ఫైనల్లో ప్రవేశించారు. మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో ఆరో సీడ్‌ సింధు 21-16, 21-11తో అయా ఒహొరి (జపాన్‌)పై విజయం సాధించింది. 40 నిమిషాల్లో ముగిసిన మ్యాచ్‌లో సింధు సంపూర్ణ ఆధిపత్యం కనబరిచింది. తొలి గేమ్‌ను సునాయాసంగా గెలుచుకున్న సింధు.. రెండో గేమ్‌ను మరింత ఏకపక్షంగా ముగించింది. సాధికారిక ఆటతీరుతో ఒహొరిని చిత్తుచేసిన సింధు.. ఆమెపై తన  రికార్డును 13-0కు పెంచుకుంది. క్వార్టర్స్‌లో యి మన్‌ జాంగ్‌ (చైనా)తో సింధు తలపడుతుంది. పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో శ్రీకాంత్‌ 21-19, 21-19తో ప్రపంచ అయిదో ర్యాంకు ఆటగాడు కున్లావత్‌ వితిద్‌సర్న్‌ (థాయ్‌లాండ్‌)పై, ప్రణయ్‌ 13-21, 21-16, 21-11తో ఆల్‌ ఇంగ్లాండ్‌ ఛాంపియన్‌ షై ఫెంగ్‌ (చైనా)పై గెలుపొందారు. మరో మ్యాచ్‌లో లక్ష్యసేన్‌ 14-21, 19-21తో లాంగ్‌ ఆగ్నస్‌ (హాంకాంగ్‌) చేతిలో పరాజయంపాలయ్యాడు. క్వార్టర్స్‌లో క్రిస్టియన్‌ ఎడినాటా (ఇండోనేసియా)తో శ్రీకాంత్‌, కెంటా నిషిమొటొ (జపాన్‌)తో ప్రణయ్‌ పోటీపడతారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు