డబ్ల్యూటీసీ ఫైనల్‌ విజేతకు రూ.13.22 కోట్లు

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో విజేతగా నిలిచే జట్టు రూ.13.22 కోట్ల నగదు బహుమతిని అందుకోనుంది. రన్నరప్‌కు రూ.6.61 కోట్లు లభిస్తాయి. 2019-21 డబ్ల్యూటీసీ టోర్నీ మాదిరిగానే ఈసారి కూడా రూ.31.4 కోట్ల ప్రైజ్‌మనీనే ఐసీసీ కేటాయించింది.

Published : 27 May 2023 02:45 IST

దుబాయ్‌: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో విజేతగా నిలిచే జట్టు రూ.13.22 కోట్ల నగదు బహుమతిని అందుకోనుంది. రన్నరప్‌కు రూ.6.61 కోట్లు లభిస్తాయి. 2019-21 డబ్ల్యూటీసీ టోర్నీ మాదిరిగానే ఈసారి కూడా రూ.31.4 కోట్ల ప్రైజ్‌మనీనే ఐసీసీ కేటాయించింది. జూన్‌ 7న ఇంగ్లాండ్‌లో ఆరంభమయ్యే ఫైనల్లో భారత్‌, ఆస్ట్రేలియా తలపడనున్న సంగతి తెలిసిందే. ‘‘టోర్నమెంట్‌ నగదు బహుమతిలో ఎలాంటి మార్పు లేదు. విజేతకు రూ.13.22 కోట్లు.. రన్నరప్‌కు రూ.6.61 కోట్లు లభిస్తాయి. దక్షిణాఫ్రికా రూ.3.72 కోట్లు (3వ స్థానం), ఇంగ్లాండ్‌ రూ.2.9 కోట్లు (4వ స్థానం), శ్రీలంక రూ.1.65 కోట్లు (అయిదో స్థానం) దక్కించుకుంటాయి. న్యూజిలాండ్‌ (6), పాకిస్థాన్‌ (7), వెస్టిండీస్‌ (8), బంగ్లాదేశ్‌ (9) తలా రూ.82.7 లక్షలు అందుకుంటాయి’’ అని ఐసీసీ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని