సత్తాచాటిన శాన్విత

హైదరాబాద్‌ యువ టెన్నిస్‌ క్రీడాకారిణి శాన్విత రెడ్డి నూకల సత్తా చాటింది. ప్రపంచ టెన్నిస్‌ టూర్‌ ఐటీఎఫ్‌ జూనియర్‌ సర్క్యూట్‌ (జె30) అండర్‌- 18 టెన్నిస్‌ టోర్నీ సింగిల్స్‌లో ఆమె రన్నరప్‌ ట్రోఫీ సొంతం చేసుకుంది.

Published : 27 May 2023 02:45 IST

కంపాలా (ఉగాండా): హైదరాబాద్‌ యువ టెన్నిస్‌ క్రీడాకారిణి శాన్విత రెడ్డి నూకల సత్తా చాటింది. ప్రపంచ టెన్నిస్‌ టూర్‌ ఐటీఎఫ్‌ జూనియర్‌ సర్క్యూట్‌ (జె30) అండర్‌- 18 టెన్నిస్‌ టోర్నీ సింగిల్స్‌లో ఆమె రన్నరప్‌ ట్రోఫీ సొంతం చేసుకుంది. అమ్మాయిల సింగిల్స్‌ ఫైనల్లో శాన్విత 4-6, 3-6 తేడాతో టాప్‌ సీడ్‌ లేలా అక్‌మెటోవా (రష్యా) చేతిలో ఓడింది. తుదిపోరు వరకూ అద్భుత ఆటతీరు ప్రదర్శించిన శాన్విత.. ఫైనల్లోనూ గట్టిగానే పోరాడినా లేలాపై పైచేయి సాధించలేకపోయింది. పటాన్‌చెరుకు చెందిన శాన్విత ప్రస్తుతం గాడియం అంతర్జాతీయ పాఠశాలలో పదకొండో తరగతి చదువుతోంది.


బెల్జియం చేతిలో భారత్‌ ఓటమి

లండన్‌: హాకీ ప్రొ లీగ్‌లో ఆలస్యంగా గోల్‌ ఇచ్చిన భారత్‌ శుక్రవారం 1-2తో బెల్జియం చేతిలో పరాజయంపాలైంది. మ్యాచ్‌లో గోల్సన్నీ పెనాల్టీ కార్నర్‌ల ద్వారానే వచ్చాయి. 18వ నిమిషంలో స్టాక్‌బ్రెయెక్స్‌ గోల్‌తో బెల్జియం 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 25వ నిమిషంలో మన్‌దీప్‌ సింగ్‌తో గోల్‌తో భారత్‌ స్కోరు సమం చేసింది. కానీ ఆఖర్లో భారత డిఫెన్స్‌ తడబడింది. చివరి నిమిషంలో తీవ్ర ఒత్తిడికి గురై వరుసగా పెనాల్టీ కార్నర్‌లు ఇచ్చింది. అందులో రెండోదాన్ని నెల్సన్‌ ఒనానా (60వ) గోల్‌గా మలిచాడు. మొదట భారత గోల్‌కీపర్‌ శ్రీజేశ్‌ దాన్ని అడ్డుకున్నా.. వెనక్కి వచ్చిన బంతిని ఒనానా నెట్లోకి కొట్టాడు. దీంతో డ్రాగా ముగుస్తుందనుకున్న మ్యాచ్‌లో విజయం బెల్జియం సొంతమైంది. భారత్‌ తన తర్వాతి మ్యాచ్‌లో శనివారం ఆతిథ్య బ్రిటన్‌ను ఢీకొంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని