MS Dhoni: ధోని ఓ ఇంద్రజాలికుడు

ధోని ఒక ఇంద్రజాలికుడని.. ఇతరులు చెత్త అనుకున్నదాన్ని నిధిగా మార్చగలడని ఆస్ట్రేలియా మాజీ స్టార్‌ మాథ్యూ హేడెన్‌ అన్నాడు.

Published : 27 May 2023 07:36 IST

దిల్లీ: ధోని ఒక ఇంద్రజాలికుడని.. ఇతరులు చెత్త అనుకున్నదాన్ని నిధిగా మార్చగలడని ఆస్ట్రేలియా మాజీ స్టార్‌ మాథ్యూ హేడెన్‌ అన్నాడు. సీఎస్కే పదోసారి ఐపీఎల్‌ ఫైనల్‌ చేరడంలో కెప్టెన్‌గా ధోని వ్యూహరచన చాలా కీలకం. టోర్నీ ఆరంభంలో ఉత్తమ బౌలింగ్‌ అందుబాటులో లేకపోయినా.. ఉన్న వారి నుంచే అతడు అత్యుత్తమ ప్రదర్శన రాబట్టాడు. బ్యాటింగ్‌లో రహానె, దూబెలను అతడు ఉపయోగించుకున్న తీరు కూడా ప్రశంసలు అందుకుంది. ‘‘ఎమ్మెస్‌ ఓ ఇంద్రజాలికుడు. ఇతరులు చెత్త అనుకున్న దాన్ని నిధిగా మార్చగలడు. చాలా నైపుణ్యమున్న కెప్టెన్‌’’ అని హేడెన్‌ అన్నాడు. రాబోయే రోజుల్లో ఒక ఆటగాడు మూడు ఫార్మాట్లలో ఆడడం కష్టమని అతడు చెప్పాడు. వన్డే క్రికెట్‌ భవిష్యత్తుపై హేడెన్‌ అనుమానం వ్యక్తం చేశాడు. ఐపీఎల్‌లో ధోని ఇంకో సీజన్‌ ఆడకపోవచ్చని కూడా హేడెన్‌ అభిప్రాయపడ్డాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని