హారికకు రెండో స్థానం

మహిళల గ్రాండ్‌ ప్రి నాలుగో అంచె టోర్నీని ద్రోణవల్లి హారిక డ్రాతో ముగించింది. పదో రౌండో ముగిసే సరికి మరో వాగ్నర్‌ (జర్మనీ), టాన్‌ (చైనా)తో కలిసి ఉమ్మడిగా అగ్రస్థానంలో ఉన్న హారిక..

Published : 28 May 2023 02:59 IST

నికోసియా: మహిళల గ్రాండ్‌ ప్రి నాలుగో అంచె టోర్నీని ద్రోణవల్లి హారిక డ్రాతో ముగించింది. పదో రౌండో ముగిసే సరికి మరో వాగ్నర్‌ (జర్మనీ), టాన్‌ (చైనా)తో కలిసి ఉమ్మడిగా అగ్రస్థానంలో ఉన్న హారిక.. ఆదివారం చివరిదైన పదకొండో రౌండ్లో గోర్యాచ్కినా అలెక్సాండ్రా (రష్యా)తో గేమ్‌ను డ్రా చేసుకుంది. దీంతో మొత్తం 11 రౌండ్ల నుంచి 6.5 పాయింట్లు సొంతం చేసుకుంది. మరోవైపు చివరి రౌండ్లో బెల్లాపై గెలిచిన వాగ్నర్‌ 7 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. హారికతో పాటు షువలోవా (రష్యా), టాన్‌ కూడా 6.5 పాయింట్లే సాధించారు. మెరుగైన టై బ్రేక్‌ కారణంగా హారికకు రెండో స్థానం లభించింది. ఈ పోటీల్లో అజేయంగా నిలిచిన హారిక.. రెండు విజయాలు, 9 డ్రాలు నమోదు చేసింది. ఈ గ్రాండ్‌ ప్రి పోరులో ఓవరాల్‌గా హారిక 250 పాయింట్లతో అయిదో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఆమె మ్యూనిచ్‌లో 90, దిల్లీలో 50, తాజాగా నికోసియాలో 110 పాయింట్లు సాధించింది. తొలి రెండు స్థానాల్లో నిలిచిన లాగ్నో (325), గోర్యాచ్కినా (318) క్యాండిడేట్స్‌ టోర్నీలో పోటీపడే అవకాశాన్ని కొట్టేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని