బ్రిటన్‌ చేతిలో భారత్‌ ఓటమి

ప్రొ లీగ్‌ హాకీ రెండో అంచె టోర్నీలో భారత్‌కు వరుసగా రెండో ఓటమి. శనివారం హర్మన్‌ప్రీత్‌ సేన 2-4 గోల్స్‌తో ఆతిథ్య బ్రిటన్‌ చేతిలో ఓడిపోయింది.

Published : 28 May 2023 02:50 IST

ప్రొ లీగ్‌ హాకీ

లండన్‌: ప్రొ లీగ్‌ హాకీ రెండో అంచె టోర్నీలో భారత్‌కు వరుసగా రెండో ఓటమి. శనివారం హర్మన్‌ప్రీత్‌ సేన 2-4 గోల్స్‌తో ఆతిథ్య బ్రిటన్‌ చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో మొదటి నుంచి దూకుడుగా ఆడిన బ్రిటన్‌.. తిమోతి నర్స్‌ (6వ నిమిషం) చేసిన గోల్‌తో ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ 13వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను హర్మన్‌ప్రీత్‌ సద్వినియోగం చేయడంతో స్కోరు సమమైంది. మూడో క్వార్టర్‌లో భారత్‌ పట్టు సడలింది. విజృంభించిన బ్రిటన్‌.. రెండు గోల్స్‌ (థామస్‌ 31వ, లీ మోర్టాన్‌ 33వ) కొట్టేసి 3-1తో ఒత్తిడి పెంచింది. హర్మన్‌ప్రీత్‌ (42వ) ఓ గోల్‌ కొట్టినా.. మరో గోల్‌ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆఖర్లో నికోలాస్‌ (53వ) స్కోరు చేసి బ్రిటన్‌ విజయాన్ని ఖాయం చేశాడు. తొలి మ్యాచ్‌లో బెల్జియం చేతిలో హర్మన్‌ప్రీత్‌ బృందం ఓడిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని