సిట్సిపాస్‌ శుభారంభం

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో అయిదో సీడ్‌ సిట్సిపాస్‌ (గ్రీస్‌) శుభారంభం చేశాడు. గట్టి ప్రతిఘటన ఎదురైన మొదటి రౌండ్లో అతడు 7-5, 6-3, 4-6, 7-6 (9-7)తో వెస్లీ (చెక్‌)పై విజయం సాధించాడు.

Published : 29 May 2023 02:30 IST

ఫ్రెంచ్‌ ఓపెన్‌

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌లో అయిదో సీడ్‌ సిట్సిపాస్‌ (గ్రీస్‌) శుభారంభం చేశాడు. గట్టి ప్రతిఘటన ఎదురైన మొదటి రౌండ్లో అతడు 7-5, 6-3, 4-6, 7-6 (9-7)తో వెస్లీ (చెక్‌)పై విజయం సాధించాడు. మ్యాచ్‌లో సిట్సిపాస్‌ 12 ఏస్‌లు, 58 విన్నర్లు కొట్టాడు. 11వ సీడ్‌ కచనోవ్‌ (రష్యా) కూడా రెండో రౌండ్లో ప్రవేశించాడు. మొదటి రౌండ్లో అతడు 3-6, 1-6, 6-2, 6-1, 6-3తో లెస్టీన్‌  (ఫ్రాన్స్‌)పై విజయం సాధించాడు. తొలి రెండు సెట్లు కోల్పోయాక కచనోవ్‌ అద్భుతంగా పుంజుకున్నాడు. పదునైన సర్వీసులు చేసిన అతడు మ్యాచ్‌లో 15 ఏస్‌లు సంధించాడు. 57 విన్నర్లు కొట్టాడు. లెస్టీన్‌ ఆరు డబుల్‌ ఫాల్ట్‌లు చేశాడు. 13వ సీడ్‌ హర్కజ్‌ (పోలెండ్‌) 6-3, 5-7, 6-4, 2-6, 6-4తో గొఫిన్‌ (బెల్జియం)ని మట్టికరిపించాడు. ఇతర మ్యాచ్‌ల్లో ఫుస్కోవిచ్‌ 6-3, 5-7, 6-1, 6-3తో గ్రెనియర్‌పై, కొకినా కిస్‌ 6-4, 6-4, 6-4తో ఎవాన్స్‌పై, కుబ్లెర్‌ 1-6, 6-3, 6-4, 3-6, 6-1తో దిజయా అకోస్టాపై, కోర్డా 6-4, 7-5, 6-4తో మెక్‌డొనాల్డ్‌పై గెలిచారు. అల్బాట్‌, కర్బాలెస్‌, అర్నాల్ది, బోర్గెస్‌ బయానా కూడా ముందంజ వేశారు. మహిళల సింగిల్స్‌ రెండో సీడ్‌ సబలెంక (బెలారస్‌) అలవోకగా రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. ఏకపక్షంగా సాగిన తొలి రౌండ్లో ఆమె 6-3, 6-2తో కోస్త్యుక్‌ (ఉక్రెయిన్‌)ను చిత్తు చేసింది. మ్యాచ్‌లో సబలెంక సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మరోవైపు ఎనిమిదో సీడ్‌ సకారికి తొలి రౌండ్లోనే షాక్‌ తగిలింది. ఆమె 6-7 (5-7), 5-7తో ముచోవా చేతిలో ఓడిపోయింది. ఇతర మ్యాచ్‌ల్లో గియోర్గి 6-3, 6-4తో కోర్నెట్‌పై, లెలా ఫెర్నాండెజ్‌ 6-3, 1-6, 6-3తో లినెట్టెపై, పొదొరొస్కా 6-0, 6-2తో పోంచెట్‌పై, ఫ్రెచ్‌ 6-1, 6-1తో జాంగ్‌పై, మెర్టెన్స్‌ 6-1, 6-4తో రుంకకోవాపై విజయం సాధించారు. హంటర్‌, జెంగ్‌, టౌసన్‌ ముందంజ వేశారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు