రెండో రౌండ్లో జకోవిచ్‌

ఫేవరెట్లు నొవాక్‌ జకోవిచ్‌ (సెర్బియా), అల్కరాస్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌ రెండో రౌండ్‌కు దూసుకెళ్లారు.

Published : 30 May 2023 03:48 IST

ఫ్రెంచ్‌ ఓపెన్‌

పారిస్‌: ఫేవరెట్లు నొవాక్‌ జకోవిచ్‌ (సెర్బియా), అల్కరాస్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌ రెండో రౌండ్‌కు దూసుకెళ్లారు. మొదటి రౌండ్లో జకోవిచ్‌ 6-3, 6-2, 7-6 (7-1)తో కొవాసెవిచ్‌ (అమెరికా)ను మట్టికరిపించాడు. టాప్‌సీడ్‌ అల్కరాస్‌ (స్పెయిన్‌) 6-0, 6-2, 7-5తో కొబోలి (ఇటలీ)పై గెలిచాడు. మరో మ్యాచ్‌లో ఏడో సీడ్‌ రుబ్లెవ్‌ 6-1, 3-6, 6-3, 6-4తో లాస్లో జెర్‌పై విజయం సాధించాడు. 14వ సీడ్‌ నోరీ 7-5, 4-6, 3-6, 6-1, 6-4తో పయర్‌ను ఓడించాడు. 19వ సీడ్‌ బటిస్టా అగట్‌   7-6 (7-4), 6-1, 6-1తో యిబింగ్‌ వు ను ఓడించి రెండో రెండ్లో అడుగుపెట్టాడు. ఇతర మ్యాచ్‌ల్లో ఫోగ్నిని 6-4, 6-4, 6-3తో అలియాసిమెపై, షపోవలోవ్‌ 6-4, 7-5, 4-6, 3-6, 6-3తో నకషిమపై, వావ్రింకా 7-6 (7-5), 6-4, 6-7 (2-7), 1-6, 6-4తో రామోస్‌ వినోలాస్‌పై గెలిచారు. ష్వార్జ్‌మాన్‌, డిమినార్‌, డానియల్‌, గిరోన్‌, వారిలాస్‌ కూడా ముందంజ వేశారు. మహిళల సింగిల్స్‌లో స్టీఫెన్స్‌, స్వితోలినా శుభారంభం చేశారు. తొలి రౌండ్లో స్టీఫెన్స్‌ 6-0, 6-4తో ప్లిస్కోవాపై నెగ్గింది. స్వితోలినా 6-2, 6-2తో ట్రెవిసన్‌ను ఓడించింది. గార్సియా 7-6 (7-4), 4-6, 6-4తో వాంగ్‌పై నెగ్గింది.20వ సీడ్‌ మాడిసన్‌ కీస్‌ శుభారంభం చేసింది. ఆరంభ రౌండ్లో ఆమె 6-1, 3-6, 6-1తో కనెపిపై విజయం సాధించింది. 12వ సీడ్‌ బెన్సిచ్‌ తొలి రౌండ్‌ను అధిగమించలేపోయింది. ఆమె 3-6, 6-2, 4-6తో అవనేస్యన్‌ చేతిలో పరాజయంపాలైంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని