టైటిల్‌పై సింధు గురి
థాయ్‌లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్‌కు వేళైంది.. ఈ సీజన్లో తొలి టైటిల్ కోసం నిరీక్షిస్తున్న స్టార్ షట్లర్ పి.వి.సింధు మంగళవారం ఆరంభమయ్యే ఈ టోర్నీలో టైటిల్ సాధించాలనే పట్టుదలతో బరిలో దిగుతోంది.
నేటి నుంచే థాయ్‌లాండ్ ఓపెన్
బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్‌కు వేళైంది.. ఈ సీజన్లో తొలి టైటిల్ కోసం నిరీక్షిస్తున్న స్టార్ షట్లర్ పి.వి.సింధు మంగళవారం ఆరంభమయ్యే ఈ టోర్నీలో టైటిల్ సాధించాలనే పట్టుదలతో బరిలో దిగుతోంది. మలేసియా ఓపెన్లో సెమీఫైనల్లో వెనుదిరిగిన సింధు.. సింగిల్స్ తొలి రౌండ్లో మిచెలీ లీ (కెనడా)ని ఢీకొంటుంది. ఈ మ్యాచ్ గెలిస్తే రెండో రౌండ్లో వాంగ్ జీ (చైనా) ఎదురయ్యే అవకాశం ఉంది. పురుషుల సింగిల్స్‌లో మలేసియా మాస్టర్స్ విజేత ప్రణయ్ తప్పుకున్న నేపథ్యంలో అందరి దృష్టి కిదాంబి శ్రీకాంత్‌పైనే ఉంది. తొలి రౌండ్లో అతడు మలేసియా మాస్టర్స్ రన్నరప్ వెంగ్ హంగ్ (చైనా)తో తలపడనున్నాడు. వాంగ్ జు వీయ్ (చైనీస్ తైపీ)తో లక్ష్యసేన్, పొపోవ్ (ఫ్రాన్స్)తో సాయిప్రణీత్.. జీయాంగ్ (మలేసియా)తో ప్రియాంశు రావత్ పోటీపడనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Manipur: అల్లర్లతో అట్టుడికిన మణిపుర్లో.. ఉగ్ర కలకలం
-
Lokesh: పవన్ సభకు ప్రభుత్వం ఆటంకం కలిగించే అవకాశం: లోకేశ్
-
Asian Games: భారత్‌కు మరో రెండు పతకాలు.. ఫైనల్‌కు కిదాంబి శ్రీకాంత్
-
HCA: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Social Look: సమంత సైకిల్ రైడ్.. దేవకన్యలా ప్రియాంక.. రెడ్ డ్రెస్‌లో అనన్య