Dhoni Fans: ధోనీ అభిమానులకు అక్కడే పడక

ధోనీపై అభిమానానికి ప్రాంతీయ, భాషా భేదాలేమీ ఉండవు. దేశంలో అతను ఎక్కడ ఆడినా స్టేడియాలు అభిమానులతో నిండిపోతాయి. అతను ఐపీఎల్‌ ఫైనల్‌ ఆడుతుంటే.. పైగా ఇదే  తన చివరి మ్యాచ్‌ కావచ్చన్న అంచనాలుంటే.. అభిమానులు స్టేడియాన్ని ముంచెత్తకుండా ఉంటారా? ఆదివారం అదే జరిగింది.

Updated : 30 May 2023 08:36 IST

అహ్మదాబాద్‌: ధోనీపై అభిమానానికి ప్రాంతీయ, భాషా భేదాలేమీ ఉండవు. దేశంలో అతను ఎక్కడ ఆడినా స్టేడియాలు అభిమానులతో నిండిపోతాయి. అతను ఐపీఎల్‌ ఫైనల్‌ ఆడుతుంటే.. పైగా ఇదే  తన చివరి మ్యాచ్‌ కావచ్చన్న అంచనాలుంటే.. అభిమానులు స్టేడియాన్ని ముంచెత్తకుండా ఉంటారా? ఆదివారం అదే జరిగింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఎటు చూసినా పసుపు జెర్సీలే. చెన్నై నుంచే కాక అనేక ప్రాంతాల నుంచి మహి కోసం వచ్చిన అభిమానులకు నిరాశ తప్పలేదు. వర్షం వల్ల మ్యాచ్‌ తర్వాతి రోజుకు వాయిదా పడటంతో వారి కష్టాలు అన్నీ ఇన్నీ కావు. సోమవారం ఉదయానికే విమాన, రైలు టికెట్లు బుక్‌ చేసుకున్న వారిలో కొంతమంది తప్పక అహ్మదాబాద్‌ను వీడితే.. ధోని ఆట చూడాల్సిందే అని పట్టుదల పట్టిన వాళ్లు అక్కడే ఉండిపోయారు. హోటళ్లలో ఉండేందుకు డబ్బుల్లేని వాళ్లు పెద్ద సంఖ్యలో రైల్వే స్టేషన్లలోనే పడకేశారు. పసుపు జెర్సీలతో పెద్ద సంఖ్యలో ధోని అభిమానులు రైల్వే స్టేషన్లలో పడుకున్న ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతం అయ్యాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని