నీకోసం ఏమైనా..
ఐపీఎల్ ఫైనల్లో విజయం అనంతరం సీఎస్కే ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ట్విటర్లో పెట్టిన ఓ అందమైన పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటోంది. కెప్టెన్ ధోని కోసం ఆ పెట్టిన పోస్ట్ వైరల్ అయింది.
అహ్మదాబాద్: ఐపీఎల్ ఫైనల్లో విజయం అనంతరం సీఎస్కే ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ట్విటర్లో పెట్టిన ఓ అందమైన పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటోంది. కెప్టెన్ ధోని కోసం ఆ పెట్టిన పోస్ట్ వైరల్ అయింది. ‘‘ఒకే ఒక్కడి కోసం, ఒక్క ఎంఎస్ ధోని కోసం మేం ఇది సాధించాం. మహి భాయ్ నీకోసం ఏమైనా..’’ అని జడ్డూ ట్వీట్ చేశాడు. ఫైనల్లో చివరి రెండు బంతుల్లో 10 పరుగులు చేసిన జడేజా.. చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. మొదట గుజరాత్ టైటాన్స్ 4 వికెట్లకు 214 పరుగులు చేయగా.. వర్షం కారణంగా 15 ఓవర్లకు 171 పరుగులకు సవరించిన లక్ష్యాన్ని చెన్నై ఆఖరి బంతికి ఛేదించింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కాన్వే (47), దూబె (32 నాటౌట్), రహానె (27), రుతురాజ్ (26), రాయుడు (19), జడేజా (15 నాటౌట్) చెన్నై విజయంలో కీలకపాత్ర పోషించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Jawan: ‘జవాన్’లో నయనతార పాత్ర అద్భుతం.. కానీ..: షారుక్ ఖాన్
-
Motkupalli Narasimhulu : జైలులో చంద్రబాబుకు ఏదైనా జరిగితే జగన్‌దే బాధ్యత : మోత్కుపల్లి
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Chandrababu : క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఆదేశాలను సుప్రీంలో సవాల్ చేసిన చంద్రబాబు
-
Narendra Modi: శివతత్వం ప్రతిబింబించేలా వారణాసి క్రికెట్ స్టేడియం..
-
Crime News: కుమారుడిని చంపి.. ఇంటి ముందు పడేసి: ‘మీ సింహమిదిగో’ అంటూ హేళన