సాత్విక్‌, చిరాగ్‌ జీ 4

భారత అగ్రశ్రేణి డబుల్స్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజు, చిరాగ్‌ శెట్టి కెరీర్లో అత్యుత్తమ ర్యాంకు సాధించింది. ఈ సీజన్‌లో స్విస్‌ ఓపెన్‌ సూపర్‌ 300 టైటిల్‌ను గెలుచుకున్న భారత ద్వయం ర్యాంకింగ్స్‌లో ఒక స్థానం మెరుగై నాలుగో స్థానానికి చేరుకుంది.

Published : 31 May 2023 02:40 IST

దిల్లీ: భారత అగ్రశ్రేణి డబుల్స్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజు, చిరాగ్‌ శెట్టి కెరీర్లో అత్యుత్తమ ర్యాంకు సాధించింది. ఈ సీజన్‌లో స్విస్‌ ఓపెన్‌ సూపర్‌ 300 టైటిల్‌ను గెలుచుకున్న భారత ద్వయం ర్యాంకింగ్స్‌లో ఒక స్థానం మెరుగై నాలుగో స్థానానికి చేరుకుంది. ఆరేళ్ల విరామం తర్వాత ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) టైటిల్‌ను గెలిచిన హెచ్‌.ఎస్‌. ప్రణయ్‌ ఎనిమిదో ర్యాంకులో నిలిచాడు. కిదాంబి శ్రీకాంత్‌ మూడు స్థానాలు ఎగబాకి 20వ ర్యాంకు సాధించాడు. మహిళల సింగిల్స్‌లో పి.వి. సింధు 13వ స్థానంలో కొనసాగుతోంది. మహిళల డబుల్స్‌లో గాయత్రి, ట్రీసా 15వ స్థానంలో నిలిచారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని