Snehasish Ganguly: ప్రపంచకప్ లోపు కవర్లు కొనండి: స్నేహశిష్ గంగూలీ
ఐపీఎల్ ఫైనల్‌కు ఊహించని విధంగా వర్షం అంతరాయం కలిగించింది. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఆదివారం మ్యాచ్ సాధ్యం కాకపోవడంతో రిజర్వ్‌డే రోజు నిర్వహించాల్సి వచ్చింది.
కోల్‌కతా: ఐపీఎల్ ఫైనల్‌కు ఊహించని విధంగా వర్షం అంతరాయం కలిగించింది. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఆదివారం మ్యాచ్ సాధ్యం కాకపోవడంతో రిజర్వ్‌డే రోజు నిర్వహించాల్సి వచ్చింది. మైదానాన్ని పూర్తిగా కప్పే వ్యవస్థ లేకపోవడం వల్ల రిజర్వ్‌డే రోజు మ్యాచ్ ఆలస్యమైంది. మ్యాచ్‌కు ఉపయోగించని పిచ్‌లు బురద మయం కావడంతో.. వాటిని ఆరబెట్టేందుకు గ్రౌండ్స్‌మన్ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు స్నేహశిష్ గంగూలీ మాట్లాడుతూ.. ‘‘కొత్త స్టేడియంలో త్వరగానే సమస్య పరిష్కారమవుతుందని అనుకుంటున్నా. ఈడెన్ గార్డెన్స్‌లోలా వర్షం వచ్చినప్పుడు మొత్తం మైదానాన్ని కప్పేలా కవర్లు ఏర్పాటు చేసుకోవాలి. ప్రపంచకప్ ఆరంభంలోపు సమస్య పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నా’’ అని స్నేహశిష్ అన్నాడు. ప్రస్తుతం దేశంలోని క్రికెట్ స్టేడియాల్లో మైదానాన్ని పూర్తిగా కప్పే వ్యవస్థ ఈడెన్‌గార్డెన్స్‌లో మాత్రమే ఉంది. 2016 టీ20 ప్రపంచకప్ సందర్భంగా భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఆరంభానికి ముందు రెండున్నర గంటలపాటు వర్షం అంతరాయం కలిగించినా.. కేవలం రెండు ఓవర్ల కోతతో అక్కడ మ్యాచ్ నిర్వహించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
MS Dhoni: ప్రపంచ కప్‌లో మాహీ... ఎందుకంత స్పెషల్ అంటే!
-
US Speaker: అమెరికా చరిత్రలో తొలిసారి.. స్పీకర్‌కు ఉద్వాసన
-
Delhi Liquor Scam: ఆప్ నేత సంజయ్ సింగ్ ఇంట్లో ఈడీ సోదాలు
-
Asian Games: ఆర్చరీలో స్వర్ణం.. ఆసియా క్రీడల్లో భారత్ ‘పతకాల’ రికార్డ్
-
Stock Market: కొనసాగుతున్న నష్టాల పరంపర.. 19,400 దిగువకు నిఫ్టీ
-
AP BJP: ‘పవన్’ ప్రకటనలపై ఏం చేద్దాం!