టీమ్‌ఇండియాకు సవాలే..

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ఆడబోతున్న టీమ్‌ఇండియాకు జట్టులోని ఆటగాళ్లు టీ20 ఫార్మాట్‌ నుంచి ఎంత త్వరగా బయటపడతారన్నదే అతిపెద్ద సవాల్‌ అని క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ అన్నాడు.

Published : 31 May 2023 02:40 IST

అహ్మదాబాద్‌: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ఆడబోతున్న టీమ్‌ఇండియాకు జట్టులోని ఆటగాళ్లు టీ20 ఫార్మాట్‌ నుంచి ఎంత త్వరగా బయటపడతారన్నదే అతిపెద్ద సవాల్‌ అని క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ అన్నాడు. ‘‘దాదాపుగా జట్టులోని ఆటగాళ్లంతా ఐపీఎల్‌ పూర్తిచేసుకుని వెళ్తున్నవాళ్లే. టీ20 ఫార్మాట్‌ నుంచి వాళ్లు బయటపడి టెస్టు ఫార్మాట్‌కు ఎంత త్వరగా సిద్ధమవుతారన్నదే అతిపెద్ద సవాల్‌. జట్టులోని ఆటగాళ్లలో ప్రస్తుతం కౌంటీ ఛాంపియన్‌షిప్‌ ఆడుతున్న పుజారా ఒక్కడే సుదీర్ఘ ఫార్మాట్‌కు సిద్ధంగా ఉన్నాడు’’ అని చెప్పాడు. రహానె పునరాగమనంపై మాట్లాడుతూ.. ‘‘ఇంగ్లాండ్‌లో ఆడిన అనుభవం రహానెకు ఉంది. అయిదో స్థానంలో అతడు కీలకం అవుతాడు. తానేంటో నిరూపించుకునేందుకు రహానెకు మరో అవకాశం లభించింది. ఇంకా చాలా కాలం క్రికెట్‌ ఆడగల సత్తా అతడికి ఉంది అని నమ్ముతున్నా’’ అని గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు