పాకిస్థాన్‌లో ఐసీసీ ఛైర్మన్‌

భారత్‌లో జరిగే వన్డే ప్రపంచకప్‌కు జట్టును పక్కాగా పంపిస్తామనే హామీని పొందేందుకు ఐసీసీ ఛైర్మన్‌ గ్రెగ్‌ బార్క్‌లే, ముఖ్య కార్యనిర్వహణ అధికారి జెఫ్‌ అలార్డీస్‌ పాకిస్థాన్‌కు వెళ్లారు.

Published : 01 Jun 2023 01:51 IST

కరాచి: భారత్‌లో జరిగే వన్డే ప్రపంచకప్‌కు జట్టును పక్కాగా పంపిస్తామనే హామీని పొందేందుకు ఐసీసీ ఛైర్మన్‌ గ్రెగ్‌ బార్క్‌లే, ముఖ్య కార్యనిర్వహణ అధికారి జెఫ్‌ అలార్డీస్‌ పాకిస్థాన్‌కు వెళ్లారు. ఆసియాకప్‌ కోసం పాకిస్థాన్‌కు భారత్‌ జట్టును పంపకపోతే తాము ప్రపంచకప్‌ కోసం భారత్‌కు వెళ్లమని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) అధిపతి నజమ్‌ సేథి స్పష్టం చేసిన నేపథ్యంలో వాళ్లు ప్రత్యేకంగా లాహోర్‌కు వచ్చారు. ప్రపంచకప్‌ కోసం భారత్‌కు వెళ్లడానికి పాకిస్థాన్‌ ప్రభుత్వం అనుమతి నిరాకరిస్తే.. తమ మ్యాచ్‌లను తటస్థ వేదికలో నిర్వహించాలని ఐసీసీని కోరతామని సేథి ఇంతకుముందే సూచనప్రాయంగా చెప్పాడు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని