Virat Kohli: కోహ్లీ అందరికన్నా ముందొచ్చి..

ఐపీఎల్‌లో తన సహచరులు విరాట్‌ కోహ్లి, సిరాజ్‌ గురించి ఆస్ట్రేలియా ఫాస్ట్‌బౌలర్‌ హేజిల్‌వుడ్‌ గొప్పగా మాట్లాడాడు.

Updated : 01 Jun 2023 09:46 IST

లండన్‌: ఐపీఎల్‌లో తన సహచరులు విరాట్‌ కోహ్లి, సిరాజ్‌ గురించి ఆస్ట్రేలియా ఫాస్ట్‌బౌలర్‌ హేజిల్‌వుడ్‌ గొప్పగా మాట్లాడాడు. ఆట పట్ల అంకిత భావమే కోహ్లీని మేటి క్రికెటర్‌ను చేసిందని అన్నాడు. ‘‘కోహ్లి చాలా కష్టపడతాడు. అతడిలో గొప్ప లక్షణం అదే. సాధనకు అందరికన్నా ముందొచ్చి.. చివరిగా వెళ్తాడు. చాలా తీవ్రంగా సాధన చేస్తాడు. అతడి నుంచి ప్రేరణ పొంది మిగతా ఆటగాళ్లూ మెరుగవుతారు’’ అని హేజిల్‌వుడ్‌ చెప్పాడు. సిరాజ్‌ గురించి మట్లాడుతూ.. ‘‘ఎప్పుడూ వికెట్ల వేటలో ముందుంటాడు. ఎకానమీ రేట్‌ కూడా బాగుంటుంది. చిన్నస్వామిలో బౌలింగ్‌ చాలా కష్టం. అలాంటి చోట అతడు ఆరు, ఆరున్నర ఎకానమీ రేట్‌తో బౌలింగ్‌ చేశాడు. గొప్ప నియంత్రణతో బంతులేస్తాడు’’ అని అన్నాడు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని