MS Dhoni: ధోని.. మోకాలి గాయాన్ని బట్టే తుదినిర్ణయం: సీఎస్కే సీఈవో విశ్వనాథన్‌

ఈ ఐపీఎల్‌లో మోకాలి గాయంతో మహేంద్రసింగ్‌ ధోని ఎంత ఇబ్బంది పడ్డాడో తెలిసిందే. వయసు కూడా 42 ఏళ్లకు చేరువ కావడంతో ఈ సీజన్‌తోనే అతను ఐపీఎల్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించేస్తాడేమో అన్న చర్చ కూడా జరిగింది.

Updated : 01 Jun 2023 07:58 IST

దిల్లీ: ఈ ఐపీఎల్‌లో మోకాలి గాయంతో మహేంద్రసింగ్‌ ధోని ఎంత ఇబ్బంది పడ్డాడో తెలిసిందే. వయసు కూడా 42 ఏళ్లకు చేరువ కావడంతో ఈ సీజన్‌తోనే అతను ఐపీఎల్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించేస్తాడేమో అన్న చర్చ కూడా జరిగింది. కానీ చెన్నైకి అయిదో ట్రోఫీ అందించిన అనంతరం ధోని మాట్లాడుతూ.. కష్టమైనప్పటికీ అభిమానుల కోసం ఇంకో సీజన్‌ ఆడేందుకు ప్రయత్నిస్తానన్నాడు.

అయితే మోకాలి గాయం తీవ్రతను బట్టే ఇంకో సీజన్‌ ఆడటంపై తుది నిర్ణయం తీసుకుంటాడని చెన్నై సూపర్‌కింగ్స్‌ సీఈవో విశ్వనాథన్‌ తెలిపాడు. ‘‘తన ఎడమ మోకాలి గాయం విషయంలో వైద్య నిపుణుల సలహా ఆధారంగా ధోని నిర్ణయం తీసుకుంటాడు. వైద్య నివేదికలను అనుసరించి అతను శస్త్రచికిత్స కూడా చేయించుకోవచ్చు. ఏదైనా నిర్ణయం తనదే’’ అని విశ్వనాథన్‌ అన్నాడు. ధోని ప్రత్యామ్నాయాల గురించి ఇప్పటిదాకా తాము ఆలోచించలేదని అతను స్పష్టం చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని