చెస్‌లో భారత్‌ అగ్రగామి అవుతుంది

చెస్‌లో భారత్‌ అగ్రగామి దేశం కావడానికి ఇంకెంతో కాలం పట్టదని అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ అన్నాడు.

Updated : 01 Jun 2023 02:46 IST

దిల్లీ: చెస్‌లో భారత్‌ అగ్రగామి దేశం కావడానికి ఇంకెంతో కాలం పట్టదని అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ అన్నాడు. ఈ తరంలో అత్యుత్తమ చెస్‌ ఆటగాడిగా పేరున్న కార్ల్‌సన్‌.. ప్రస్తుతం ప్రపంచ ర్యాపిడ్‌ ఛాంపియన్‌. గత కొన్నేళ్లుగా భారత క్రీడాకారులు కూడా అంతర్జాతీయంగా గొప్పగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. భారత్‌ నిరుడు చెస్‌ ఒలింపియాడ్‌కు కూడా ఆతిథ్యమిచ్చింది. ‘‘దేశంలో చెస్‌ అభివృద్ధి కోసం భారత్‌ ఎంతో చేస్తోంది. ప్రపంచంలో భారత్‌ అగ్రగామి చెస్‌ దేశం కావడానికి ఎంతో కాలం పట్టదు’’ అని కార్ల్‌సన్‌ అన్నాడు. గ్లోబల్‌ చెస్‌ లీగ్‌ (జీసీఎల్‌)లో దిగ్గజ ఆటగాళ్లలో కార్ల్‌సన్‌ ఒకడు. ‘‘ఈ లీగ్‌లో పాల్గొనాలనే ఉత్సాహంతో ఉన్నా. చాలా కొత్తగా అనిపిస్తోంది. భారత క్రీడాకారులతో కలసి ఆడాలని, భారత క్రీడాకారులతో తలపడాలని ఆసక్తిగా ఉంది’’ అని అతడు చెప్పాడు. ఆరు ఫ్రాంఛైజీలు పోటీపడే జీసీఎల్‌ జూన్‌ 21 నుంచి జులై 2 వరకు దుబాయ్‌లో జరుగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని