త్రిపుర క్రికెట్‌ బాధ్యతలు క్లుసెనర్‌కు!

దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్‌ లాన్స్‌ క్లుసెనర్‌ త్రిపుర క్రికెట్‌ వ్యవహారాల బాధ్యతలు చేపట్టనున్నాడు.

Published : 01 Jun 2023 01:51 IST

అగర్తల: దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్‌ లాన్స్‌ క్లుసెనర్‌ త్రిపుర క్రికెట్‌ వ్యవహారాల బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో క్రికెట్‌ ప్రమాణాలను పెంచడం, యువ ఆటగాళ్లను జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా క్లుసెనర్‌తో ఒప్పందం చేసుకుంటున్నట్లు ఆ రాష్ట్ర క్రికెట్‌ సంఘం ఉపాధ్యక్షుడు తిమిర్‌ చందా తెలిపాడు. క్లుసెనర్‌ ఇంకా ఒప్పందంపై సంతకం చేయని నేపథ్యంలో అతను చేపట్టబోయే పదవి ఏంటో ఇంకా వెల్లడి కాలేదు. త్రిపురలో పురుషులు, మహిళలు కలిపి వివిధ స్థాయిల్లో ఉన్న ఎనిమిది జట్లను క్లుసెనర్‌ పర్యవేక్షించనున్నట్లు తెలిసింది. ముందుగా అతను అగర్తలకు చేరుకుని 20 రోజుల పాటు క్రికెటర్ల ఆటతీరును పరిశీలించనున్నాడు. ఆ సమయంలోనే 100 రోజుల పాటు పని చేసేందుకు ఒప్పందం త్రిపుర క్రికెట్‌ సంఘంతో ఒప్పందం చేసుకోనున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని