సింధు ఔట్
థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్ 500 టోర్నీలో పీవీ సింధు కథ తొలి రౌండ్లోనే ముగిసింది. మహిళల సింగిల్స్ పోరులో ఆమె 8-21, 21-18, 18-21తో కెనడాకు చెందిన మిషెల్ లీ చేతిలో పరాజయంపాలైంది.
తొలి రౌండ్లోనే పరాజయం
ప్రపంచ నంబర్ 9కు కిరణ్ షాక్
థాయ్‌లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్
బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్ 500 టోర్నీలో పీవీ సింధు కథ తొలి రౌండ్లోనే ముగిసింది. మహిళల సింగిల్స్ పోరులో ఆమె 8-21, 21-18, 18-21తో కెనడాకు చెందిన మిషెల్ లీ చేతిలో పరాజయంపాలైంది. మరోవైపు సైనా నెహ్వాల్ శుభారంభం చేసింది. మొదటి రౌండ్లో ఆమె 21-13, 21-7తో వెన్ యు జాంగ్ (కెనడా)ను చిత్తుగా ఓడించింది. క్వాలిఫయర్స్ ద్వారా వచ్చిన అష్మిత తొలి రౌండ్లో 21-17, 21-14తో మాళవిక బాన్సోద్‌పై నెగ్గి ముందంజ వేసింది. పురుషుల సింగిల్స్‌లో కిరణ్ జార్జ్ సంచలనం సృష్టించాడు. మొదటి రౌండ్లో అతడు 21-18, 22-20తో ప్రపంచ నంబర్ 9, మూడో సీడ్ షి యు ఖికి షాకిచ్చాడు. యు ఖి 2018 ప్రపంచ ఛాంపియన్‌షిప్ రజత పతక విజేత. కిరణ్ తన తర్వాతి రౌండ్లో వెంగ్ హాంగ్‌ను ఢీకొంటాడు. లక్ష్యసేన్ కూడా రెండో రౌండ్‌కు దూసుకెళ్లాడు. ఆరంభ పోరులో అతడు 21-23, 21-15, 21-15తో వాంగ్ జు వీ (చైనీస్ తైపీ)పై విజయం సాధించాడు. కిదాంబి శ్రీకాంత్ మాత్రం తొలి రౌండ్ దాటలేకపోయాడు. అతడు 8-21, 21-16, 14-21తో వెంగ్ హాంగ్ (చైనా) చేతిలో పరాజయంపాలయ్యాడు. సాయి ప్రణీత్ కూడా త్వరగానే ఇంటిముఖం పట్టాడు. ప్రణీత్ 14-21, 16-21తో క్రిస్టో పొపోవ్ (ఫ్రాన్స్) చేతిలో కంగుతున్నాడు. మరో మ్యాచ్‌లో సమీర్ వర్మ 15-21, 15-21తో మాగ్నస్ జొహానెసన్ (డెన్మార్క్)కు తలవంచాడు. ప్రియాంశు రజావత్ కథ కూడా తొలి రౌండ్లోనే ముగిసింది. పురుషుల డబుల్స్‌లో టాప్ సీడ్ సాత్విక్‌సాయిరాజు-చిరాగ్ శెట్టి జోడీ రెండో రౌండ్లో అడుగుపెట్టింది. మొదటి రౌండ్లో ఈ జంట 21-13, 18-21, 21-17తో డెన్మార్క్‌కు చెందిన ఫ్రెడరిక్ సొగార్డ్, రాస్మస్ జయేర్ ద్వయంపై విజయం సాధించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World Culture Festival: ఘనంగా ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు ప్రారంభం
-
Air India: వేడి నీళ్లు పడి విమాన ప్రయాణికురాలికి గాయాలు.. క్షమాపణలు కోరిన ఎయిర్ఇండియా!
-
Ravichandran Ashwin అదృష్టమంటే అశ్విన్‌దే.. క్రికెట్ అభిమానులు సుడిగాడు అంటున్నారు!
-
TCS: టీసీఎస్ కీలక నిర్ణయం.. ‘హైబ్రిడ్’కు గుడ్‌బై..!
-
Baby: ‘బేబి’ విజయం.. దర్శకుడికి నిర్మాత బహుమానం.. అదేంటంటే?
-
ఐదేళ్ల RDపై వడ్డీ పెంపు.. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి వడ్డీ రేట్లు పాతవే