అల్కరాస్‌ జోరు

టైటిల్‌ ఫేవరెట్‌ అల్కరాస్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌లో మూడో రౌండ్‌కు దూసుకెళ్లాడు. రెండో రౌండ్లో టాప్‌ సీడ్‌ అల్కరాస్‌ 6-1, 3-6, 6-1, 6-2తో డానియల్‌పైను ఓడించాడు.

Published : 01 Jun 2023 01:55 IST

మూడో రౌండ్లో ప్రవేశం
ఫ్రెంచ్‌ ఓపెన్‌

పారిస్‌: టైటిల్‌ ఫేవరెట్‌ అల్కరాస్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌లో మూడో రౌండ్‌కు దూసుకెళ్లాడు. రెండో రౌండ్లో టాప్‌ సీడ్‌ అల్కరాస్‌ 6-1, 3-6, 6-1, 6-2తో డానియల్‌పైను ఓడించాడు. మ్యాచ్‌లో అతడు 47 విన్నర్లు కొట్టాడు. అయిదో సీడ్‌ సిట్సిపాస్‌ (గ్రీస్‌), 11వ సీడ్‌ కచనోవ్‌ కూడా మూడో రౌండ్లో అడుగుపెట్టారు. సిట్సిపాస్‌ 6-3, 7-6 (4), 6-2తో రాబర్టో కర్బాలెస్‌ బయానాపై విజయం సాధించగా.. కచనోవ్‌ 6-3, 6-4, 6-2తో అల్బాట్‌ను మట్టికరిపించాడు. వావ్రింకా 6-3, 5-7, 3-6, 7-6 (7-4), 3-6తో కొకినాకిస్‌ చేతిలో కంగుతిన్నాడు. ఇతర రెండో రౌండ్‌ మ్యాచ్‌ల్లో ఫోగ్నిని 6-4, 7-6 (7-5), 6-2తో కుబ్లెర్‌పై, సొనెగో 6-4, 6-3, 7-6 (7-3)తో హంబర్ట్‌పై, ష్వార్జ్‌మాన్‌ 7-6 (7-3), 6-4, 6-3తో బోర్గెస్‌పై, ఆఫ్నర్‌ 6-3, 7-6 (7-1), 6-4తో కోర్డాపై విజయం సాధించారు.

పెగులా ముందుకు..: మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్‌ సబలెంక (బెలారస్‌), మూడో సీడ్‌ జెస్సికా పెగులా (అమెరికా) మూడో రౌండ్‌కు దూసుకెళ్లారు. రెండో రౌండ్లో పెగులా 6-2తో ఆధిక్యంలో ఉన్న దశలో ప్రత్యర్థి కామిలా జియార్జి (ఇటలీ) గాయంతో రిటైరైంది. సబలెంక 7-5, 6-2తో షమినోవిచ్‌ (బెలారస్‌)పై విజయం సాధించింది. మ్యాచ్‌లో సబలెంక 21 విన్నర్లు కొట్టింది. 9వ సీడ్‌ కసాట్కినా 6-3, 6-4తో వొండ్రుసోవాను ఓడించి మూడో రౌండ్‌కు దూసుకెళ్లింది. మరో మ్యాచ్‌లో స్టీఫెన్స్‌ 6-2, 6-1తో గ్రచేవాపై విజయం సాధించింది. అయిదో సీడ్‌ గార్సియా మాత్రం రెండో రౌండ్‌ దాటలేకపోయింది. ఆమె 6-4, 3-6, 5-7తో బ్లిన్కోవా చేతిలో పరాజయంపాలైంది. మాజీ ఛాంపియన్‌ ఒస్తాపెంకో కథ కూడా ముగిసింది. రెండో రౌండ్లో ఆమె 3-6, 6-1, 2-6తో పేటాన్‌ సెర్ట్న్‌్స చేతిలో ఓడిపోయింది. ఇతర రెండో రౌండ్‌ మ్యాచ్‌ల్లో స్వితోలినా 2-6, 6-3, 6-1తో హంటర్‌పై, మెర్టెన్స్‌ 6-3, 7-6 (7-3) ఒసోరియాపై, పవ్లిచెంకోవా 4-6, 7-5, 7-5తో సమ్సనోవాపై నెగ్గారు. పుతిన్‌త్సెవా, బెగు, పొటపోవా, ముచోవా కూడా మూడో రౌండ్లో ప్రవేశించారు.

రెండో రౌండ్లో యుకి-సాకేత్‌ జోడీ: పురుషుల డబుల్స్‌లో యుకి బాంబ్రి, సాకేత్‌ మైనేని జంట శుభారంభం చేసింది. మొదటి రౌండ్లో ఈ జోడీ 6-3, 6-2తో కవాకాడ్‌, రిందర్‌నెచ్‌ ద్వయంపై నెగ్గింది. రోహన్‌ బోపన్న, ఎబ్డెన్‌ (ఆస్ట్రేలియా) జంట తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. ఈ జోడీ 5-7, 6-7 (5-7)తో డౌంబియా, రెబౌల్‌ జంట చేతిలో ఓడిపోయింది. శ్రీరామ్‌ బాలాజి, జీవన్‌ నెదుంచెజియన్‌ జంట కూడా తొలి రౌండ్‌ను అధిగమించలేకపోయింది. ఈ ద్వయం 3-6, 4-6తో ఇవాష్క, పొపిరిన్‌ జోడీ చేతిలో ఓటమి చవిచూసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని