ఫైనల్ నుంచి కొత్తకొత్తగా
ఆస్ట్రేలియాతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ నుంచి టీమ్‌ఇండియా కొత్త జెర్సీల్లో కనిపించనుంది. ఇటీవల కిట్ స్పాన్సర్‌గా బీసీసీఐతో ఒప్పందం చేసుకున్న అడిడాస్.. ఈ కొత్త జెర్సీలను గురువారం ఆవిష్కరించింది.
దిల్లీ: ఆస్ట్రేలియాతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ నుంచి టీమ్‌ఇండియా కొత్త జెర్సీల్లో కనిపించనుంది. ఇటీవల కిట్ స్పాన్సర్‌గా బీసీసీఐతో ఒప్పందం చేసుకున్న అడిడాస్.. ఈ కొత్త జెర్సీలను గురువారం ఆవిష్కరించింది. మూడు ఫార్మాట్లకు మూడు రకాల జెర్సీలను రూపొందించింది. వీటిపై తమ లోగో అయిన మూడు గీతలను అడిడాస్ ముద్రించింది. పురుషుల, మహిళల్లో.. భారత సీనియర్ జట్లతో పాటు భారత- ఎ, భారత- బి, అండర్-19 జట్లు, కోచ్‌లు, సిబ్బందికి అడిడాసే కిట్లు అందించనుంది. ‘‘అన్ని ఫార్మాట్ల కిట్లకు అధికారిక స్పాన్సర్‌గా అడిడాస్ ఒప్పందం మార్చి 2028 వరకు కొనసాగుతుంది. బీసీసీఐ పురుషుల, మహిళల, యూత్ జట్ల మ్యాచ్, శిక్షణ, ప్రయాణానికి సంబంధించిన అన్ని దుస్తులను అడిడాసే అందిస్తుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌తో ఈ కొత్త జెర్సీ అరంగేట్రం చేయనుంది’’ అని బీసీసీఐ ప్రకటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
సూరత్‌లో రూ.600 కోట్ల వజ్ర గణపతి
-
లేచి నిలబడి భక్తులను దీవిస్తున్న వినాయకుడు!
-
Bhuma Akhila Priya: భూమా అఖిలప్రియ నిరాహార దీక్ష భగ్నం
-
Team India: భారత క్రికెట్ చరిత్రలో అరుదైన ఫీట్..
-
Vijay Deverakonda: ఆ బ్రాండ్‌కు విజయ్ దేవరకొండ బై.. ఈసారి అంతకుమించి!
-
Mohajer-10: 2 వేల కి.మీల దూరం.. 24 గంటలు గాల్లోనే.. సరికొత్త డ్రోన్లు ప్రదర్శించిన ఇరాన్