పాకిస్థాన్‌ లేకుండానే ఆసియాకప్‌!

ఆసియాకప్‌లో ఆతిథ్య పాకిస్థాన్‌ పోటీపడేది అనుమానంగా మారింది. షెడ్యూల్‌ ప్రకారం ఈ టోర్నీ సెప్టెంబరులో పాకిస్థాన్‌లో నిర్వహించాలి.

Updated : 02 Jun 2023 04:17 IST

ముంబయి: ఆసియాకప్‌లో ఆతిథ్య పాకిస్థాన్‌ పోటీపడేది అనుమానంగా మారింది. షెడ్యూల్‌ ప్రకారం ఈ టోర్నీ సెప్టెంబరులో పాకిస్థాన్‌లో నిర్వహించాలి. భద్రత కారణాలతో ఆ దేశంలో పర్యటించేందుకు బీసీసీఐ విముఖత చూపించిన నేపథ్యంలో.. భారత్‌ మ్యాచ్‌లను మాత్రం దుబాయ్‌లో నిర్వహించేందుకు పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) ప్రతిపాదన తెచ్చింది. అయితే టోర్నీలో అన్ని మ్యాచ్‌లు ఒకే వేదికలో నిర్వహించాలని నిర్ణయించిన ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ).. పాక్‌ నుంచి ఆసియాకప్‌ను తరలించాలని నిర్ణయించినట్లు సమాచారం. పాకిస్థాన్‌ ఆడకపోయినా భారత్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌లతో పాటు మరో జట్టుతో కలిసి శ్రీలంకలో ఈ టోర్నీని నిర్వహించేందుకు ఏసీసీ సిద్ధమవుతోంది. మరి పాకిస్థాన్‌ ఆడుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు భారత్‌లో జరిగే వన్డే ప్రపంచకప్‌లోనూ ఆ జట్టు పాల్గొనడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని