టీమ్‌ఇండియా.. ఫలితం పట్టించుకోకుండా: హేడెన్‌

గత దశాబ్ద కాలంగా ఐసీసీ ట్రోఫీ గెలవలేదనే విషయం భారత ఆటగాళ్ల బుర్రలో తిరుగుతోందని, ఫలితం గురించి మరిచిపోయి కంగారూలతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో తలపడాలని ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హేడెన్‌ టీమ్‌ఇండియాకు సూచించాడు.

Published : 02 Jun 2023 01:44 IST

దిల్లీ: గత దశాబ్ద కాలంగా ఐసీసీ ట్రోఫీ గెలవలేదనే విషయం భారత ఆటగాళ్ల బుర్రలో తిరుగుతోందని, ఫలితం గురించి మరిచిపోయి కంగారూలతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో తలపడాలని ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హేడెన్‌ టీమ్‌ఇండియాకు సూచించాడు. ‘‘నైపుణ్యాల పరంగా టీమ్‌ఇండియాకు ఎలాంటి సమస్య లేదు. ఇది కేవలం అవకాశం, మానసిక దృక్పథం మీదే ఆధారపడి ఉంది. భారత్‌లో క్రికెట్టే జీవితం. క్రీడారంగానికి అదే డీఎన్‌ఏ. దీనికి పోటీనే లేదు. ఇక్కడి క్రికెటర్లపై ఎంతో ఒత్తిడి ఉంటుంది. టీమ్‌ఇండియా ఫలితం గురించి మరిచిపోయి, ప్రక్రియలో భాగమవ్వాలనేదే నా సలహా’’ అని అతను తెలిపాడు. ఈ ఫైనల్‌ జరిగే ఓవల్‌ వేదిక తటస్థంగా ఉంటుందని, ఏ జట్టుకూ అనుకూలంగా ఉండదని హేడెన్‌ అభిప్రాయపడ్డాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని