WTC Final - IPL: ఐపీఎల్‌లో ఆ బంతులతోనే ప్రాక్టీస్ చేశాం
ఐపీఎల్‌లో రెండు నెలల పాటు తెల్ల బంతులతో ఆడి ఇప్పుడు ఆస్ట్రేలియాతో జూన్ 7న ఓవల్‌లో ఆరంభమయ్యే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో ఎర్ర బంతులతో ఆడేందుకు తమకు ఎలాంటి ఇబ్బంది లేదంటున్నాడు ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్.
పోర్ట్స్‌మౌత్: ఐపీఎల్‌లో రెండు నెలల పాటు తెల్ల బంతులతో ఆడి ఇప్పుడు ఆస్ట్రేలియాతో జూన్ 7న ఓవల్‌లో ఆరంభమయ్యే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో ఎర్ర బంతులతో ఆడేందుకు తమకు ఎలాంటి ఇబ్బంది లేదంటున్నాడు ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్. ఐపీఎల్ సమయంలో డ్యూక్స్ బంతులు (ఎరుపు రంగు) ఉపయోగించి ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేసినట్లు అతడు వెల్లడించాడు. ‘‘ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ గురించి ఐపీఎల్ ఆరంభానికి ముందే తెలుసు. ఎంత సమయం ఉందో అవగాహన ఉంది. అందుకే డ్యూక్స్ బంతులతోనే సాధన చేశాం. ఇప్పుడు తెల్ల బంతి నుంచి ఎరుపు బంతికి మారడం పెద్ద కష్టమేమీ కాదు’’ అని అన్నాడు.
ఐర్లాండ్ 172 ఆలౌట్
లార్డ్స్: ఐర్లాండ్‌తో ఏకైక టెస్టులో ఆతిథ్య ఇంగ్లాండ్ తొలిరోజే పట్టు బిగించింది. స్టువర్ట్ బ్రాడ్ (5/51) విజృంభించడంతో గురువారం మొదటి ఇన్నింగ్స్‌లో ఐర్లాండ్‌ను 172కే ఆలౌట్ చేసిన ఇంగ్లిష్ జట్టు.. తొలి ఇన్నింగ్స్‌లో ఆట చివరికి 152/1తో నిలిచింది. డకెట్ (60), పోప్ (29) క్రీజులో ఉన్నారు. క్రాలీ (56) ఔటయ్యాడు. క్రాలీ-డకెట్ జోడీ తొలి వికెట్‌కు 109 పరుగులు జత చేసి శుభారంభం ఇచ్చింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్.. బ్రాడ్ ధాటికి నిలువలేకపోయింది. అతడితో పాటు లీచ్ (3/35), పాట్స్ (2/36) రాణించడంతో క్రమం తప్పకుండా వికెట్లు చేజార్చుకున్న ఐర్లాండ్.. తక్కువ స్కోరుకే ఆలౌటైంది. మెక్‌కలమ్ (36), కాంఫర్ (33), స్టిర్లింగ్ (30) పోరాడకపోతే ఆ జట్టు ఆ మాత్రం స్కోరు కూడా చేసేది కాదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.