సెమీస్‌లో లక్ష్యసేన్
థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో లక్ష్యసేన్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. శుక్రవారం పురుషుల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో అతడు 21-19, 21-11తో లియాంగ్ జన్ హవో (మలేసియా)ను ఓడించాడు.
కిరణ్ ఇంటిముఖం
థాయ్‌లాండ్ ఓపెన్
బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో లక్ష్యసేన్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. శుక్రవారం పురుషుల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో అతడు 21-19, 21-11తో లియాంగ్ జన్ హవో (మలేసియా)ను ఓడించాడు. ఈ పోరులో తొలి గేమ్‌లో మాత్రమే సేన్‌కు లియాంగ్ నుంచి గట్టిపోటీ ఎదురైంది. విరామ సమయానికి 10-11తో నిలిచిన భారత స్టార్.. ఆ తర్వాత ఇంకా తడబడి 10-16తో గేమ్ చేజార్చుకునేలా కనిపించాడు. కానీ అనూహ్యంగా పుంజుకున్న సేన్.. వరుస పాయింట్లతో 17-17తో స్కోరు సమం చేయడమే కాక.. అదే జోరులో గేమ్ గెలిచాడు. రెండో గేమ్‌లో సేన్ దూకుడుగా ఆడాడు. 11-8తో బ్రేక్‌కు వెళ్లాడు. అయితే పట్టు వదలని లియాంగ్ 11-13తో సేన్‌ను సమీపించాడు. ఈ దశలో విజృంభించిన భారత కుర్రాడు.. వరుస పాయింట్లతో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్లో ఓ టోర్నీలో సెమీస్ చేరడం లక్ష్యకు ఇదే తొలిసారి. మరోవైపు యువ షట్లర్ కిరణ్ జార్జ్ పోరాటానికి తెరపడింది. క్వార్టర్స్‌లో అతడు 16-21, 17-21తో టోమా పొపోవ్ (ఫ్రాన్స్) చేతిలో ఓడాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
మాలేపాటి సుబ్బానాయుడి గృహ నిర్బంధం
-
Chandrababu Arrest: ఆంక్షలు దాటి, పోలీసుల కళ్లు కప్పి.. ర్యాలీకి ఎమ్మెల్యే కోటంరెడ్డి
-
Delhi Liquor scam: ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్టు
-
TSRTC: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు మరో శుభవార్త
-
Rohit On WC 2023: మా టార్గెట్ అదే.. అలాంటి పోలికలను పట్టించుకోం: రోహిత్
-
TS News: తెలంగాణలో ఓటర్ల జాబితా విడుదల.. వర్గాల వారీగా ఇదీ లెక్క!