శాన్విత జోడీకి టైటిల్‌

హైదరాబాద్‌ యువ టెన్నిస్‌ క్రీడాకారిణి నూకల శాన్విత మరోసారి అదరగొట్టింది. మిషెల్‌ ఖోమిచ్‌ (జర్మనీ)తో కలిసి ప్రపంచ టెన్నిస్‌ టూర్‌ ఐటీఎఫ్‌ జూనియర్‌ సర్క్యూట్‌ (జె30) అండర్‌-18 డబుల్స్‌ టైటిల్‌ను ఆమె సొంతం చేసుకుంది.

Published : 03 Jun 2023 02:35 IST

కంపాలా (ఉగాండా): హైదరాబాద్‌ యువ టెన్నిస్‌ క్రీడాకారిణి నూకల శాన్విత మరోసారి అదరగొట్టింది. మిషెల్‌ ఖోమిచ్‌ (జర్మనీ)తో కలిసి ప్రపంచ టెన్నిస్‌ టూర్‌ ఐటీఎఫ్‌ జూనియర్‌ సర్క్యూట్‌ (జె30) అండర్‌-18 డబుల్స్‌ టైటిల్‌ను ఆమె సొంతం చేసుకుంది. శుక్రవారం జరిగిన అమ్మాయిల డబుల్స్‌ ఫైనల్లో శాన్విత- మిషెల్‌ జోడీ 3-6, 6-4, 10-4 తేడాతో లేలా అక్‌మెటోవా (రష్యా)- సియా మహాజన్‌ (భారత్‌)పై విజయం సాధించింది. తొలి సెట్‌ ఓడినప్పటికీ.. శాన్విత ద్వయం తిరిగి బలంగా పుంజుకుంది. ఆ తర్వాత వరుసగా రెండు సెట్లలో నెగ్గి విజేతగా నిలిచింది. ఇప్పటికే ఈ టోర్నీ అండర్‌-18 అమ్మాయిల సింగిల్స్‌లో శాన్విత రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని