భారత్‌ చేతిలో బెల్జియం చిత్తు

ప్రొ లీగ్‌ హాకీ ఐరోపా అంచె టోర్నీలో వరుసగా రెండు ఓటములతో ఢీలా పడిన భారత హాకీ జట్టు గాడిలో పడింది. మూడో మ్యాచ్‌లో తిరుగులేని ఆటతో ఒలింపిక్‌ ఛాంపియన్‌ బెల్జియంను 5-1 గోల్స్‌తో చిత్తు చేసి తొలి మ్యాచ్‌లో ఆ జట్టు చేతిలో ఓటమికి బదులు తీర్చుకుంది.

Published : 03 Jun 2023 02:35 IST

ప్రొ లీగ్‌ హాకీ

లండన్‌: ప్రొ లీగ్‌ హాకీ ఐరోపా అంచె టోర్నీలో వరుసగా రెండు ఓటములతో ఢీలా పడిన భారత హాకీ జట్టు గాడిలో పడింది. మూడో మ్యాచ్‌లో తిరుగులేని ఆటతో ఒలింపిక్‌ ఛాంపియన్‌ బెల్జియంను 5-1 గోల్స్‌తో చిత్తు చేసి తొలి మ్యాచ్‌లో ఆ జట్టు చేతిలో ఓటమికి బదులు తీర్చుకుంది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (20వ ని, 29వ ని) విజయంలో కీలకపాత్ర పోషించాడు. వివేక్‌ ప్రసాద్‌ (1వ), అమిత్‌ రోహిదాస్‌ (28వ), దిల్‌ప్రీత్‌ సింగ్‌ (59వ) తలో గోల్‌ కొట్టారు. బెల్జియం తరఫున ఏకైక గోల్‌ను విలియమ్‌ (45వ) సాధించాడు. ఈ టోర్నీలో తొలి మ్యాచ్‌లో బెల్జియం చేతిలో 1-2తో, రెండో మ్యాచ్‌లో బ్రిటన్‌ చేతిలో 2-4తో భారత్‌ ఓడిపోయింది.


ఉజ్బెకిస్థాన్‌తో భారత్‌ తొలి పోరు

మహిళల ఆసియాకప్‌ జూనియర్‌ హాకీ

కకామిగారా (జపాన్‌): మహిళల జూనియర్‌ ఆసియాకప్‌ హాకీ టోర్నమెంట్‌కు వేళైంది. తాజాగా పురుషుల ఆసియా టోర్నీలో భారత్‌ విజేతగా నిలిచిన నేపథ్యంలో మహిళల జట్టు కూడా వారి బాటలోనే టైటిల్‌ను సాధించాలనే పట్టుదలతో బరిలో దిగుతోంది. శనివారం ఉజ్బెకిస్థాన్‌తో పోరుతో భారత్‌ పోటీని ప్రారంభించనుంది. ఆసియాకప్‌లో టాప్‌-3లో నిలిచిన జట్లు ప్రపంచకప్‌ (సాంటియాగో, నవంబర్‌ 29-డిసెంబర్‌ 10)కు నేరుగా అర్హత సాధించనుండడంతో ప్రీతి సారథ్యంలోని జట్టు ఈ టోర్నీని ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఉజ్బెకిస్థాన్‌, కొరియా, మలేసియా, చైనీస్‌ తైపీతో కలిసి భారత్‌ పూల్‌-ఏలో ఆడుతోంది. పూల్‌-బిలో ఆతిథ్య జపాన్‌, చైనా, ఇండోనేసియా, కజకిస్థాన్‌, హంకాంగ్‌ ఉన్నాయి. ఉజ్బెకిస్థాన్‌ తర్వాత జూన్‌ 5న మలేసియా, 6న కొరియా, 8న చైనీస్‌ తైపీతో ప్రీతి బృందం తలపడనుంది. రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ మ్యాచ్‌ల అనంతరం పూల్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఇప్పటిదాకా ఏడుసార్లు ఈ టోర్నీలో ఆడిన భారత్‌.. ఒక రజతం, నాలుగు కాంస్య పతకాలు సాధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని