పోప్‌ ద్విశతకం.. డకెట్‌ సెంచరీ

ఐర్లాండ్‌తో ఏకైక టెస్టులో ఇంగ్లాండ్‌ విజయం దిశగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థిని 172 పరుగులకే కుప్పకూల్చిన ఇంగ్లిష్‌ జట్టు.. ఒలీ పోప్‌ (205; 208 బంతుల్లో 22×4, 3×6) ద్విశతకం, బెన్‌ డకెట్‌ (182; 178 బంతుల్లో 24×4, 1×6) శతకం సాయంతో తొలి ఇన్నింగ్స్‌లో 524/4 స్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది.

Published : 03 Jun 2023 02:34 IST

ఇంగ్లాండ్‌ 524/4 డిక్లేర్డ్‌

లార్డ్స్‌: ఐర్లాండ్‌తో ఏకైక టెస్టులో ఇంగ్లాండ్‌ విజయం దిశగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థిని 172 పరుగులకే కుప్పకూల్చిన ఇంగ్లిష్‌ జట్టు.. ఒలీ పోప్‌ (205; 208 బంతుల్లో 22×4, 3×6) ద్విశతకం, బెన్‌ డకెట్‌ (182; 178 బంతుల్లో 24×4, 1×6) శతకం సాయంతో తొలి ఇన్నింగ్స్‌లో 524/4 స్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది. 352 పరుగుల భారీ ఆధిక్యాన్ని కూడా సొంతం చేసుకుంది. ఓవర్‌నైట్‌ స్కోరు 152/1తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లాండ్‌.. దూకుడుగా ఆడింది. పోప్‌-డకెట్‌ జోడీ జోరుతో 6 పైన రన్‌రేట్‌తో పరుగులు రాబట్టింది. డబుల్‌ సెంచరీ ముంగిట డకెట్‌ ఔటైనా.. రూట్‌ (56)తో కలిసి పోప్‌ ఇంగ్లాండ్‌ స్కోరును 500 దాటించాడు. ఈ క్రమంలోనే అతడు ద్విశతకాన్ని అందుకున్నాడు. పోప్‌ ఔటైన వెంటనే ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. టంగ్‌ (3/27) ధాటికి రెండో ఇన్నింగ్స్‌లో తడబడ్డ ఐర్లాండ్‌.. రెండో రోజు ఆఖరికి 97/3తో నిలిచింది. ఆ జట్టు ఇంకా 255 పరుగులు వెనకబడి ఉంది. టెక్టార్‌ (33), టకర్‌ (21) క్రీజులో ఉన్నారు.


అఫ్గాన్‌ చేతిలో లంక ఓటమి

హంబాన్‌టోట: ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌ ముంగిట అఫ్గానిస్థాన్‌ సిరీస్‌తో ఆత్మవిశ్వాసం పెంచుకోవాలనుకున్న శ్రీలంకకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ! మూడు వన్డేల పోరులో భాగంగా గురువారం తొలి మ్యాచ్‌లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో అఫ్గాన్‌ చేతిలో ఓడిపోయింది. మొదట లంక 50 ఓవర్లలో 268 పరుగులు చేసింది. అసలంక (91; 95 బంతుల్లో 12×4) సత్తా చాటాడు. 84/4తో ఇబ్బందుల్లో పడిన జట్టును ధనంజయ డిసిల్వా (51; 59 బంతుల్లో 5×4)తో కలిసి అతడు ఆదుకున్నాడు. ఫారూఖీ (2/58), ఫరీద్‌ (2/43) లంకను కట్టడి చేశారు. ఛేదనలో ఇబ్రహీం జద్రాన్‌ (98; 98 బంతుల్లో 11×4, 2×6) సత్తా చాటడంతో లక్ష్యాన్ని అఫ్గాన్‌ 46.5 ఓవర్లలో 4 వికెట్లే కోల్పోయి అందుకుంది. రెండో వికెట్‌కు రహ్మత్‌ షా (55; 80 బంతుల్లో 3×4)తో ఇబ్రహీం 146 పరుగులు జత చేసి ఛేదనలో గట్టి పునాది వేశాడు. వీరి తర్వాత హస్మతుల్లా (38), నబి (27 నాటౌట్‌) జట్టును విజయపథంలో నడిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని