లంక సిరీస్ ప్రతిపాదనకు పాక్ తిరస్కారం!
ఆసియాకప్ ఆతిథ్య అవకాశాన్ని తమ నుంచి శ్రీలంక దక్కించుకోవాలని చూడటం పాకిస్థాన్‌కు రుచించట్లేదు.
కరాచి: ఆసియాకప్ ఆతిథ్య అవకాశాన్ని తమ నుంచి శ్రీలంక దక్కించుకోవాలని చూడటం పాకిస్థాన్‌కు రుచించట్లేదు. అందుకే ఆ జట్టు చేసిన ద్వైపాక్షిక వన్డే సిరీస్ ప్రతిపాదనను పీసీబీ తిరస్కరించినట్లు సమాచారం. ‘‘వచ్చే నెలలో తమ దేశంలో వన్డే సిరీస్ ఆడాలని శ్రీలంక బోర్డు చేసిన ప్రతిపాదనను పాకిస్థాన్ తిరస్కరించింది. రెండు దేశాల బోర్డుల మధ్య సంబంధాలు దెబ్బ తిన్నాయనడానికి ఇదే ఉదాహరణ. సెప్టెంబర్‌లో తమ దేశం ఆతిథ్యం ఇవ్వాల్సిన ఆసియాకప్‌ను నిర్వహించేందుకు లంక ముందుకు రావడంతో పీసీబీ అసంతృప్తితో ఉంది. తాను చేసిన ‘హైబ్రిడ్ మోడల్’ (పాక్‌లో కనీసం 4 మ్యాచ్‌లు, తటస్థ వేదికలో మిగిలిన మ్యాచ్‌లు) ప్రతిపాదనను లంకతో పాటు బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ అంగీకరిస్తాయని పీసీబీ ఛైర్మన్ నజామ్ సేథి భావించారు. ఆ తర్వాత నెమ్మదిగా భారత క్రికెట్ బోర్డును కూడా ఒప్పించొచ్చని అనుకున్నారు. కానీ అలా జరగకపోగా ఆతిథ్యానికి సిద్ధమని లంక ముందుకొచ్చింది. ఆసియాకప్‌తో పాటు ఈ ఏడాది ఆఖర్లో జరిగే వన్డే ప్రపంచకప్‌కు సంబంధించి బలమైన నిర్ణయాలు తీసుకునే దిశగా పాక్ బోర్డు ఆలోచిస్తోంది’’ అని పీసీబీ వర్గాలు వెల్లడించాయి.
ఇంగ్లాండ్‌దే ఏకైక టెస్టు
లండన్: ఐర్లాండ్‌తో ఏకైక టెస్టును ఇంగ్లాండ్ కైవసం చేసుకుంది. శనివారం ఆ జట్టు 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 97/3తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఐర్లాండ్.. ఒక దశలో 162/6తో నిలిచింది. కానీ గొప్పగా పోరాడిన మార్క్ అడైర్ (88; 76 బంతుల్లో 12×4, 2×6), ఆండీ మెక్‌బ్రైన్ (86 నాటౌట్; 115 బంతుల్లో 14×4) ఇంగ్లాండ్ విజయాన్ని ఆలస్యం చేశారు. చివరికి ఐర్లాండ్ 362 పరుగులకు ఆలౌటైంది. 11 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 4 బంతుల్లో వికెట్లేమీ కోల్పోకుండా అందుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఐర్లాండ్ 172 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లాండ్ 524/4 వద్ద డిక్లేర్ చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Zoleka Mandela: నెల్సన్ మండేలా మనవరాలు కన్నుమూత
-
Leander Paes: టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్‌కు అరుదైన గుర్తింపు
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/09/23)
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Guntur Kaaram: రాజమౌళి చిత్రాల స్థాయిలో ‘గుంటూరు కారం’.. ఆ మాటకు కట్టుబడి ఉన్నా: నిర్మాత నాగవంశీ
-
Babar Azam: టాప్-4 చిన్న విషయం.. ప్రపంచకప్ గెలవడమే మా లక్ష్యం : బాబర్ అజామ్