రఫా.. మరో 5 నెలలు

గాయంతో ఈ సీజన్లో ఎక్కువ భాగం కోర్టులో కనబడని స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ రఫెల్‌ నాదల్‌ పునరాగమనం మరింత ఆలస్యం కానుంది.

Published : 04 Jun 2023 02:13 IST

పారిస్‌: గాయంతో ఈ సీజన్లో ఎక్కువ భాగం కోర్టులో కనబడని స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ రఫెల్‌ నాదల్‌ పునరాగమనం మరింత ఆలస్యం కానుంది. తాజాగా బార్సిలోనాలో తుంటికి శస్త్ర చికిత్స చేయించుకున్న రఫా.. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. నాదల్‌ రాకెట్‌ పట్టడానికి కనీసం 5 నెలలు సమయం పట్టొచ్చని అతడి ప్రతినిధి బెనిటో పెరిజ్‌ చెప్పాడు. ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో బరిలో దిగాక ఆటకు దూరమైన రఫా.. తాజాగా తనకెంతో అచ్చొచ్చిన ఫ్రెంచ్‌ ఓపెన్‌ నుంచి కూడా వైదొలిగాడు. వచ్చే సీజనే తన కెరీర్లో చివరిదిగా నాదల్‌ భావిస్తున్నాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్లో రఫా రెండో రౌండ్లోనే వెనుదిరిగిన సంగతి తెలిసిందే.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు