శ్రీవల్లి ద్వయానికి డబుల్స్ ట్రోఫీ
మహిళల 25 వేల డాలర్ల నకోన్ సి తమరాత్ ఐటీఎఫ్ టెన్నిస్ టోర్నీలో తెలుగమ్మాయి శ్రీవల్లి రష్మిక జోడీ టైటిల్ సొంతం చేసుకుంది.
దిల్లీ: మహిళల 25 వేల డాలర్ల నకోన్ సి తమరాత్ ఐటీఎఫ్ టెన్నిస్ టోర్నీలో తెలుగమ్మాయి శ్రీవల్లి రష్మిక జోడీ టైటిల్ సొంతం చేసుకుంది. శనివారం థాయ్‌లాండ్‌లో జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో మూడో సీడ్ శ్రీవల్లి- వైదేహి చౌదరి జంట 6-4, 6-3 తేడాతో నాలుగో సీడ్ జీల్ దేశాయ్ (భారత్)- అనస్తేసియా సుకోటినా (రష్యా)పై విజయం సాధించింది. మ్యాచ్‌లో ప్రత్యర్థి సవాలును దాటి ఆధిపత్యం ప్రదర్శించిన శ్రీవల్లి ద్వయం.. వరుస సెట్లలో గెలుపుతో ట్రోఫీ కైవసం చేసుకుంది. అంతకుముందు సెమీస్‌లో ఈ భారత జంట.. రెండో సీడ్ పునిన్- లాన్లనా (థాయ్‌లాండ్)ను 6-4, 6-4తో కంగుతినిపించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
చంద్రునిపై ల్యాండర్, రోవర్ నుంచి అందని సంకేతాలు
-
పండగ సీజనులో కొనుగోళ్ల జోరు!
-
సంక్రాంతికి గ్రహాంతర విందు
-
Amazon Prime Video: అమెజాన్ ప్రైమ్ చందాదారులా? అయితే, ఈ విషయం తెలుసా?
-
Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ప్రభాస్‌తో పాటు ఆ స్టార్ హీరోయిన్!
-
IND vs AUS: ఆసీస్‌తో రెండో వన్డే.. శ్రేయస్ అయ్యర్‌కు ఇదేనా చివరి ఛాన్స్..?