అక్కడా ఐపీఎల్‌ లాగే..

ఐపీఎల్‌లో ఆడినంత తీవ్రతతోనే డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడాలనుకుంటున్నానని సీనియర్‌ బ్యాటర్‌ అజింక్య రహానె అన్నాడు.

Published : 04 Jun 2023 02:13 IST

అరండెల్‌: ఐపీఎల్‌లో ఆడినంత తీవ్రతతోనే డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడాలనుకుంటున్నానని సీనియర్‌ బ్యాటర్‌ అజింక్య రహానె అన్నాడు. దాదాపు ఏడాదిన్నర విరామం తర్వాత అతడు టెస్టు జట్టులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ‘‘18-19 నెలల విరామం తర్వాత జట్టులోకి వచ్చా. మంచో చెడో.. జరిగిందేదో జరిగింది. గతం గురించి ఆలోచించాలనుకోవట్లేదు. తాజాగా ఆరంభించాలనుకుంటున్నా. ఐపీఎల్‌లో సీఎస్కే తరఫున ఆడడాన్ని ఆస్వాదించా. ఐపీఎల్‌కు ముందు కూడా సీజన్‌ దేశవాళీ సీజన్‌ ఆసాంతం రాణించా. ఐపీఎల్‌, రంజీ ట్రోఫీలో ఎలా ఆడానో డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ అలాగే ఆడాలనుకుంటున్నా. నేను ఫార్మాట్‌ గురించి ఆలోచించను. నేను జట్టులో స్థానం కోల్పోయినప్పుడు కుటుంబం, స్నేహితులుగా ఎంతో మద్దతుగా నిలిచారు. ఫిట్‌నెస్‌ కోసం చాలా కష్టపడ్డా. తిరిగి భారత జట్టుకు ఆడాలన్న లక్ష్యంతోనే దేశవాళీలో ఆడా’’ అని రహానె చెప్పాడు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు