రంగు రంగుల రబ్బరు బంతులతో.. టీమ్‌ఇండియా క్యాచ్‌ల ప్రాక్టీస్
ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియాపై విజయం సాధించేందుకు టీమ్‌ఇండియా అన్ని రకాలుగా సన్నద్ధమవుతోంది.
పోర్ట్స్‌మత్ (ఇంగ్లాండ్): ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియాపై విజయం సాధించేందుకు టీమ్‌ఇండియా అన్ని రకాలుగా సన్నద్ధమవుతోంది. ఓవల్‌లో బుధవారం ఆరంభమయ్యే ఈ పోరు కోసం ఇప్పటికే ఇంగ్లాండ్ చేరిన భారత్.. అక్కడి పరిస్థితులపై అవగాహన పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఫీల్డింగ్‌పైన దృష్టి పెట్టిన రోహిత్ సేన.. రంగు రంగుల రబ్బరు బంతులతో క్యాచ్ ప్రాక్టీస్ చేస్తోంది. మ్యాచ్‌లో చివరి నిమిషాల్లో బంతి గమనంలో మార్పునకు తగినట్లుగా సర్దుబాటు చేసుకోవడం కోసం టీమ్‌ఇండియా ఈ కసరత్తులు మొదలెట్టింది. ఈ నేపథ్యంలో శుభ్‌మన్ గిల్ ఆకుపచ్చ బంతితో క్యాచ్ ప్రాక్టీస్ చేశాడు. అలాగే పసుపు పచ్చ బంతులూ ఉన్నాయి. ‘‘ఫీల్డింగ్ కసరత్తుల కోసమే ఈ రంగు రంగుల రబ్బరు బంతులను ప్రత్యేకంగా తయారు చేశారు. ఇవి గల్లీ క్రికెట్లో కనిపించే బంతులు కావు. వీటిని ‘రియాక్షన్ బాల్స్’ అంటారు. ఎక్కువ గాలి, చల్లని వాతావరణ పరిస్థితులు ఉండే ఇంగ్లాండ్ లేదా న్యూజిలాండ్‌లో వీటిని ఎక్కువగా ఫీల్డింగ్ ప్రాక్టీస్ కోసం ఉపయోగిస్తారు. ముఖ్యంగా స్లిప్ ఫీల్డర్లు, వికెట్ కీపర్ల క్యాచ్ ప్రాక్టీస్‌కు వాడతారు. తేమ, మైదానంలో వలయం బయట ఎక్కువ పచ్చిక ఉండడంతో ఇంగ్లాండ్‌లో బంతికి అస్థిర చలనం అధికంగా ఉంటుంది. బ్యాటర్లకు ఔట్‌సైడ్ ఎడ్జ్ అయ్యే బంతులు ఎక్కువగా కదులుతూ ఉంటాయి. ఈ రబ్బరు బంతులు తేలిగ్గా ఉండడంతో అస్థిర చలనంతో పాటు స్వింగ్ కూడా లభిస్తుంది. వీటి ద్వారా క్యాచ్ అందుకునే చివరి నిమిషంలో గమనం మారే బంతిని పట్టుకునేందుకు ప్రాక్టీస్ దొరుకుతుంది’’ అని జాతీయ క్రికెట్ అకాడమీలో పని చేసిన ఓ ప్రముఖ ఫీల్డింగ్ కోచ్ వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Team India: ఇక్కడో జట్టు.. అక్కడో జట్టు.. కొత్త పుంతలు తొక్కుతున్న భారత క్రికెట్
-
800 Movie: విజయ్ సేతుపతి కుటుంబాన్ని బెదిరించారు: ముత్తయ్య మురళీధరన్ వ్యాఖ్యలు
-
Hyderabad: గణేశ్ నిమజ్జనానికి MMTS ప్రత్యేక సర్వీసులు.. టైమింగ్స్ ఇవే..!
-
Hyderabad: తెలంగాణ పోలీసింగ్ ఓ సక్సెస్ స్టోరీ: డీజీపీ
-
Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
-
Ajit Pawar: ఆ పదవిలో ఎంతకాలం ఉంటానో..! చర్చకు దారితీసిన అజిత్ పవార్ వ్యాఖ్యలు