Lionel Messi: చిరునవ్వుతో టాటా.. పీఎస్జీని వీడిన మెస్సి
గత కొంతకాలంగా క్లబ్ యాజమాన్యంతో విబేధాలు.. అక్కడి అభిమానుల నుంచి విమర్శల నేపథ్యంలో పారిస్ సెయింట్ జెర్మన్ (పీఎస్జీ) జట్టుతో రెండేళ్ల బంధానికి అగ్రశ్రేణి ఆటగాడు లియొనెల్ మెస్సి చిరునవ్వుతో ముగింపు పలికాడు.
పారిస్: గత కొంతకాలంగా క్లబ్ యాజమాన్యంతో విబేధాలు.. అక్కడి అభిమానుల నుంచి విమర్శల నేపథ్యంలో పారిస్ సెయింట్ జెర్మన్ (పీఎస్జీ) జట్టుతో రెండేళ్ల బంధానికి అగ్రశ్రేణి ఆటగాడు లియొనెల్ మెస్సి చిరునవ్వుతో ముగింపు పలికాడు. పీఎస్జీ సొంత మైదానం పార్క్ ది ప్రిన్సెస్ స్టేడియంలో క్లెర్మాంట్‌తో జరిగిన మ్యాచే అతనికి ఆఖరిది. ఈ మ్యాచ్‌లో పీఎస్జీ 2-3తో ఓడింది. మ్యాచ్ ఆరంభానికి ముందు మైదానంలో వ్యాఖ్యాత మెస్సి పేరు ప్రకటించినప్పుడు స్టాండ్స్‌లోని అభిమానులు అతణ్ని అగౌరవపరిచేలా అరిచారు. అదేం పట్టించుకోని మెస్సి.. తన ముగ్గురు పిల్లల చేతులు పట్టుకుని చిరునవ్వుతో మైదానంలో అడుగుపెట్టాడు. పీఎస్జీ తరపున ఆఖరి మ్యాచ్‌లోనూ గోల్ కొట్టేందుకు అతను తీవ్రంగా ప్రయత్నించినా సఫలం కాలేకపోయాడు. మ్యాచ్ ముగిశాక సహచర ఆటగాళ్లను హత్తుకున్న అతను.. ప్రత్యర్థి ఆటగాళ్లతో చేతులు కలిపాడు. ‘‘ఈ రెండేళ్ల పాటు ఆడే అవకాశం కల్పించిన క్లబ్‌కు, పారిస్‌కు, ఇక్కడి ప్రజలకు ధన్యవాదాలు. భవిష్యత్‌లో ఈ క్లబ్ మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నా’’ అని మెస్సి పేర్కొన్నాడు. పీఎస్జీతో ఆడడం సంతోషంగానే ఉందని ఈ ఏడాది మార్చిలో అతను చెప్పడంతో మరో ఏడాది ఈ క్లబ్‌తోనే కొనసాగుతాడని అనుకున్నారు. కానీ ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. తమ అనుమతి లేకుండా సౌదీ అరేబియా వెళ్లాడని మెస్సీని క్లబ్ సస్సెండ్ చేసింది. పీఎస్జీ తరపున మెస్సి 32 గోల్స్ చేయడంతో పాటు 35 గోల్స్‌లో సాయపడ్డాడు. జట్టుకు రెండు ఫ్రెంచ్ లీగ్ టైటిళ్లు, ఓ ఫ్రెంఛ్ ఛాంపియన్ ట్రోఫీ అందించాడు. అతను సౌదీ అరేబియాకు చెందిన ఓ క్లబ్‌తో ఒప్పందం కుదుర్చుకోబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Hyderabad: తెలంగాణ పోలీసింగ్ ఓ సక్సెస్ స్టోరీ: డీజీపీ
-
Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
-
Ajit Pawar: ఆ పదవిలో ఎంతకాలం ఉంటానో..! చర్చకు దారితీసిన అజిత్ పవార్ వ్యాఖ్యలు
-
KTR: త్వరలోనే మరో 40వేల డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ: కేటీఆర్
-
Jawan: ‘జవాన్’తో అరుదైన రికార్డు సృష్టించిన షారుక్.. ఒకే ఏడాదిలో రెండుసార్లు..
-
Whatsapp: ఈ ఫోన్లలో త్వరలో వాట్సప్ బంద్.. లిస్ట్ ఇదిగో..