అనర్హతకు గురైన కాటో జోడీ

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో డబుల్స్‌ ప్లేయర్‌ మియూ కాటో, ఆమె భాగస్వామి (అల్దిలా సుజియాది) అనర్హతకు గురయ్యారు.

Published : 05 Jun 2023 02:41 IST

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌లో డబుల్స్‌ ప్లేయర్‌ మియూ కాటో, ఆమె భాగస్వామి (అల్దిలా సుజియాది) అనర్హతకు గురయ్యారు. మూడో రౌండ్‌ సందర్భంగా ఓ పాయింట్‌ తర్వాత కాటో కొట్టిన బంతి ప్రమాదవశాత్తు బాల్‌గర్ల్‌ మెడకు తగలడమే అందుకు కారణం. రెండో సెట్లో పాయింట్‌ తర్వాత కాటో చాలా మామూలుగా బంతిని అవతలి కోర్టు మీదుగా బయటికి కొట్టింది. కానీ బాల్‌గర్ల్‌ మరోవైపు చూస్తుండడంతో బంతి ఆమె మెడకు తగలింది. దీంతో బాల్‌గర్ల్‌ కన్నీళ్లు పెట్టుకుంది. మొదట చైర్‌ అంపైర్‌ అలెగ్జాండర్‌ జూగ్‌.. కాటోకు హెచ్చరికతో సరిపెట్టాడు. అయితే టోర్నీ రిఫరీ రెమీ, గ్రాండ్‌స్లామ్‌ సూపర్‌వైజర్‌ వేన్‌ మెక్‌ఈవెన్‌ కోర్టులోకి వెళ్లి ఏం జరిగిందో తెలుసుకున్నారు. అంపైర్‌, ప్లేయర్లు, బాల్‌గర్ల్‌తో మాట్లాడారు. ఆ తర్వాత కాటో, సుజియాదిలను అనర్హుల్ని చేశారు. దీంతో ప్రత్యర్థి జంట బౌజ్కోవా, సారా సారిబ్స్‌ విజేతలుగా నిలిచారు. అప్పటికి వాళ్లు 7-6 (7-1), 1-3తో ఆధిక్యంలో ఉన్నారు. బాల్‌గర్ల్‌ 15 నిమిషాలు ఏడ్చిందని బౌజ్కోవా చెప్పింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని