గౌతమి-అభినవ్ జోడీకి స్వర్ణం
జూనియర్ ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో భారత క్రీడాకారులు గౌతమి బానోత్, అభినవ్ షా స్వర్ణంతో మెరిశారు.
జూనియర్ ప్రపంచకప్ షూటింగ్
షల్ (జర్మనీ): జూనియర్ ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో భారత క్రీడాకారులు గౌతమి బానోత్, అభినవ్ షా స్వర్ణంతో మెరిశారు. ఆదివారం 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఫైనల్లో గౌతమి-అభినవ్ జోడీ 17-7తో ముల్లర్-రొమైన్ (ఫ్రాన్స్)ను ఓడించారు. క్వాలిఫికేషన్లో రెండో స్థానం సాధించిన భారత జంట (628.3 పాయింట్లు) ఫైనల్లో అదిరే ప్రదర్శనతో పసిడి పట్టేసింది. కాంస్య పతక పోరులో నోర్-జెన్స్ (నార్వే) 17-13తో స్కియావాన్-లూకా (ఇటలీ)పై నెగ్గారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ ఫైనల్లో సైన్యం-అభినవ్ చౌదరి రజతం గెలుచుకున్నారు. ఫైనల్లో భారత జంట 12-16తో జురి-కిమ్ (కొరియా) జోడీ చేతిలో ఓడింది. ఇదే విభాగంలో సురుచి-శుభమ్ బిస్లా కంచు పతకం నెగ్గారు. కాంస్య పోరులో భారత ద్వయం 16-14తో నిగీనా-కమలోవ్ (ఉజ్బెకిస్థాన్)ను ఓడించారు. పురుషుల స్కీట్‌లో రితురాజ్‌్ 19, అభయ్‌సింగ్ 21వ స్థానాలతో సరిపెట్టుకోగా.. మహిళల్లో రిజా థిల్లాన్ 11, ముఫాదాల్ 14, సంజన సూద్ 16 స్థానాల్లో నిలిచారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
KTR: దిల్లీ బాస్‌ల అనుమతి లేకుండానే లక్ష్మణ్ అలా మాట్లాడారా?: కేటీఆర్
-
Rajinikanth: ‘తలైవా 170’ గురించి ఆసక్తికర విషయం పంచుకున్న రజనీకాంత్..
-
MS Dhoni: ప్రపంచ కప్‌లో మాహీ... ఎందుకంత స్పెషల్ అంటే!
-
US Speaker: అమెరికా చరిత్రలో తొలిసారి.. స్పీకర్‌కు ఉద్వాసన
-
Delhi Liquor Scam: ఆప్ నేత సంజయ్ సింగ్ ఇంట్లో ఈడీ సోదాలు
-
Asian Games: ఆర్చరీలో స్వర్ణం.. ఆసియా క్రీడల్లో భారత్ ‘పతకాల’ రికార్డ్