వెర్‌స్టాపెన్‌దే స్పానిష్‌ గ్రాండ్‌ప్రి

రెడ్‌బుల్‌ స్టార్‌ డ్రైవర్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ ఈ ఏడాది మరో టైటిల్‌ను ఖాతాలో వేసుకున్నాడు. జోరు కొనసాగించిన అతడు స్పానిష్‌ గ్రాండ్‌ ప్రి ఫార్ములావన్‌ రేసులో విజేతగా నిలిచాడు

Published : 05 Jun 2023 02:41 IST

మాంట్‌మెలో (స్పెయిన్‌): రెడ్‌బుల్‌ స్టార్‌ డ్రైవర్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ ఈ ఏడాది మరో టైటిల్‌ను ఖాతాలో వేసుకున్నాడు. జోరు కొనసాగించిన అతడు స్పానిష్‌ గ్రాండ్‌ ప్రి ఫార్ములావన్‌ రేసులో విజేతగా నిలిచాడు. పోల్‌ పొజిషన్‌ నుంచి ఆదివారం ఫైనల్‌ రేసు మొదలుపెట్టిన వెర్‌స్టాపెన్‌ 26 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ సీజన్లో ఇప్పటిదాకా 7 రేసులు జరిగితే అందులో అయిదు ఈ రెడ్‌బుల్‌ ఆటగాడే గెలవడం విశేషం. స్పానిష్‌ గ్రాండ్‌ప్రిలో మెర్సిడెస్‌ స్టార్‌ లూయిస్‌ హామిల్టన్‌ (18) రన్నరప్‌గా నిలవగా.. అతడి సహచరుడు రసెల్‌ (15) మూడో స్థానం.. ఈ ఏడాది రెండు రేసులు నెగ్గిన సెర్గియో పెరిజ్‌ (రెడ్‌బుల్‌) నాలుగో స్థానం సాధించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు