భారత్‌కు రెండు స్వర్ణాలు

ఆసియా అండర్‌-20 అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ ఆదివారం రెండు స్వర్ణాలు, ఓ కాంస్యం గెలుచుకుంది.

Published : 05 Jun 2023 02:41 IST

ఆసియా అండర్‌-20 అథ్లెటిక్స్‌

యెచియాన్‌ (కొరియా): ఆసియా అండర్‌-20 అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ ఆదివారం రెండు స్వర్ణాలు, ఓ కాంస్యం గెలుచుకుంది. మహిళల 400 మీటర్ల పరుగులో హీనా, పురుషుల డిస్కస్‌ త్రోలో భరత్‌ప్రీత్‌ సింగ్‌ పసిడి పతకాలు గెలిచారు. హీనా 55.31 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుంది. భరత్‌ప్రీత్‌ 55.66 మీటర్ల త్రోతో అగ్రస్థానం సాధించాడు. మహిళల 5 వేల మీటర్ల రేసులో అంతిమా పాల్‌ కాంస్యం చేజిక్కించుకుంది. 17 నిమిషాల 17.11 సెకన్లలో ఆమె రేసును పూర్తి చేసింది.


ఫైనల్లో వర్షం వస్తే..

భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జూన్‌ 7న ఓవల్‌లో మొదలయ్యే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు వర్షం అడ్డంకిగా మారితే ఏంటి పరిస్థితి? ఇలా జరిగితే జూన్‌ 12న రిజర్వ్‌డేను ఉపయోగించుకునే వీలుంది. అయిదో రోజుల ఆటలో ఎక్కువ శాతం వర్షం వల్ల నష్టపోయినా.. లేక ఒక రోజు ఆట మొత్తం వర్షం వల్ల తుడిచిపెట్టుకుపోయినా.. మ్యాచ్‌ ఆరో రోజుకు వెళుతుంది. రిజర్వ్‌ డే కూడా ఆట సవ్యంగా సాగక, మ్యాచ్‌ డ్రా అయితే భారత్‌-ఆస్ట్రేలియాలను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు