ఆ ఆరు జట్లు ఇవే..

మొట్టమొదటి గ్లోబల్‌ చెస్‌ లీగ్‌ (జీసీఎల్‌)కు రంగం సిద్ధమవుతోంది. ఈ నెల 21 నుంచి జులై 2 వరకు దుబాయ్‌లో జరిగే ఆరంభ సీజన్‌లో పోటీ పడే ఆరు ఫ్రాంఛైజీలను సోమవారం వెల్లడించారు.

Published : 06 Jun 2023 03:01 IST

గ్లోబల్‌ చెస్‌ లీగ్‌

దిల్లీ: మొట్టమొదటి గ్లోబల్‌ చెస్‌ లీగ్‌ (జీసీఎల్‌)కు రంగం సిద్ధమవుతోంది. ఈ నెల 21 నుంచి జులై 2 వరకు దుబాయ్‌లో జరిగే ఆరంభ సీజన్‌లో పోటీ పడే ఆరు ఫ్రాంఛైజీలను సోమవారం వెల్లడించారు. అప్‌గ్రాడ్‌ ముంబా మాస్టర్స్‌ (యజమాన్యం- యూ స్పోర్ట్స్‌), గాంజెస్‌ గ్రాండ్‌మాస్టర్స్‌ (ఇన్యూర్‌కోట్‌ స్పోర్ట్స్‌), బాలన్‌ అలక్సన్‌ నైట్స్‌ (పునిత్‌ బాలన్‌ గ్రూప్‌), త్రివేణి కాంటినెంటల్‌ కింగ్స్‌ (త్రివేణి ఇంజినీరింగ్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌), చింగారి గల్ఫ్‌ టైటాన్స్‌ (చింగారి యాప్‌), ఎస్జీ ఆల్పిన్‌ వారియర్స్‌ (ఏపీఎల్‌ అపోలో ఎస్జీ స్పోర్ట్స్‌) జట్లు ఈ తొలి సీజన్‌లో తలపడనున్నాయి. డబుల్‌ రౌండ్‌ రాబిన్‌, ర్యాపిడ్‌ ఫార్మాట్లో జరిగే ఈ పోటీల్లో ప్రతి జట్టు కనీసం 10 మ్యాచ్‌లాడతాయి. లీగ్‌ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ప్రతి జట్టులోనూ పురుషులు, మహిళలు, అండర్‌-21 ప్లేయర్స్‌ ఉంటారు. దిగ్గజాలు విశ్వనాథన్‌ ఆనంద్‌, డింగ్‌ లిరెన్‌, మాగ్నస్‌ కార్ల్‌సన్‌, ఇయాన్‌ నెపోమ్నిషి, యిఫాన్‌ తదితర ఆటగాళ్లు ఈ లీగ్‌లో భాగం కాబోతున్నారు. త్వరలోనే ఆటగాళ్లను జట్లు ఎంపిక చేసుకోబోతున్నాయి. ‘‘లీగ్‌కు వాస్తవ రూపం కల్పించే దిశగా మేం సాగుతున్నాం. మా దృక్పథాన్ని విశ్వసించే సరైన భాగస్వాములు మాకు దొరికారు. ఈ లీగ్‌ను విజయవంతం చేసేందుకు ఎదురు చూస్తున్నాం’’ అని ఫిడే అధ్యక్షుడు అర్కాడీ వోర్కోవిచ్‌ పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని