సిద్ధార్థ్‌కు స్వర్ణం

ఆసియా అండర్‌-20 అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో షాట్‌పుట్‌లో సిద్ధార్థ్‌ చౌదరి స్వర్ణంతో మెరిశాడు. సోమవారం అతడు గుండును అత్యుత్తమంగా 19.52 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానంలో నిలిచాడు.

Published : 06 Jun 2023 03:01 IST

యెచెయాన్‌ (కొరియా): ఆసియా అండర్‌-20 అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో షాట్‌పుట్‌లో సిద్ధార్థ్‌ చౌదరి స్వర్ణంతో మెరిశాడు. సోమవారం అతడు గుండును అత్యుత్తమంగా 19.52 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానంలో నిలిచాడు. శివమ్‌ (జావెలిన్‌ త్రో, 72.34 మీటర్లు), షారుక్‌ఖాన్‌ (3000 మీటర్ల స్టీఫుల్‌చేజ్‌, 8 నిమిషాల 51.74 సెకన్లు), సుస్మిత (లాంగ్‌జంప్‌, 5.96 మీటర్లు) రజతాలు సాధించారు. 4×400 మీటర్ల మిక్స్‌డ్‌ రిలే జట్టు (హీనా, దీపక్‌, అనుష్క, నవ్‌ప్రీత్‌, 3 నిమిషాల 30.12 సెకన్లు), షకీల్‌ (800 మీటర్లు, 1 నిమిషం 49.79 సెకన్లు) కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. ఇప్పటిదాకా భారత్‌ 9 పతకాలతో (3 స్వర్ణ, 3 రజత, 3 కాంస్యాలు) మూడో స్థానంలో కొనసాగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు