సింధు, ప్రణయ్‌లకు కఠిన డ్రా

భారత స్టార్‌ క్రీడాకారులు పి.వి.సింధు, హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌లకు సింగపూర్‌ ఓపెన్‌ ప్రపంచ సూపర్‌ 750 టోర్నీలో కఠిన డ్రా ఎదురయింది. మంగళవారం ప్రారంభంకానున్న ఈ టోర్నీలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ సింధు టైటిల్‌ నిలబెట్టుకోవాలంటే కష్టపడాల్సిందే.

Published : 06 Jun 2023 03:01 IST

సింగపూర్‌ ఓపెన్‌ నేటినుంచే

సింగపూర్‌: భారత స్టార్‌ క్రీడాకారులు పి.వి.సింధు, హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌లకు సింగపూర్‌ ఓపెన్‌ ప్రపంచ సూపర్‌ 750 టోర్నీలో కఠిన డ్రా ఎదురయింది. మంగళవారం ప్రారంభంకానున్న ఈ టోర్నీలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ సింధు టైటిల్‌ నిలబెట్టుకోవాలంటే కష్టపడాల్సిందే. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో టాప్‌ సీడ్‌ అకానె యమగూచి (జపాన్‌)తో సింధు అమీతుమీ తేల్చుకోనుంది. ప్రపంచ నంబర్‌వన్‌ యమగూచిపై 14-9తో మెరుగైన గెలుపోటముల రికార్డుండటం సింధుకు సానుకూలాంశం. అయితే ఇటీవల థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో మొదటి రౌండ్లోనే ఓడిన సింధు.. యమగూచిని నిలువరిస్తుందా అన్నది చూడాలి. ఏడో సీడ్‌ ఇంతానన్‌ రచనోక్‌ (థాయ్‌లాండ్‌)తో సైనా నెహ్వాల్‌, సుపనిద (థాయ్‌లాండ్‌)తో ఆకర్షి కశ్యప్‌ తలపడతారు. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో మూడో సీడ్‌ కొడయ్‌ నరవొక (జపాన్‌)తో ప్రణయ్‌, అయిదో సీడ్‌ చౌ తీన్‌ చెన్‌ (చైనీస్‌ తైపీ)తో లక్ష్యసేన్‌, కెంటా నిషిమొటొ (జపాన్‌)తో కిదాంబి శ్రీకాంత్‌, సునెయామా (జపాన్‌)తో ప్రియాంశు రజావత్‌ పోటీపడతారు. పురుషుల డబుల్స్‌లో అకీర- తైచి (జపాన్‌)తో అయిదో సీడ్‌ సాత్విక్‌ సాయిరాజు- చిరాగ్‌శెట్టి, లూకాస్‌- రోనన్‌ (ఫ్రాన్స్‌)తో అర్జున్‌- ధ్రువ్‌; మహిళల డబుల్స్‌లో యూంగ్‌ టింగ్‌- యూంగ్‌ లామ్‌ (హాంకాంగ్‌)తో గాయత్రి గోపీచంద్‌- ట్రీసా జాలీ తమ పోరాటాన్ని ప్రారంభిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు