క్వార్టర్స్‌లో జాబెర్
ఏడో సీడ్ జాబెర్ ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లింది. మహిళల సింగిల్స్ నాలుగో రౌండ్లో ఆమె 6-3, 6-1తో అమెరికాకు చెందిన పెరాను చిత్తు చేసింది.
గాఫ్ ముందంజ
ఫ్రెంచ్ ఓపెన్
పారిస్: ఏడో సీడ్ జాబెర్ ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లింది. మహిళల సింగిల్స్ నాలుగో రౌండ్లో ఆమె 6-3, 6-1తో అమెరికాకు చెందిన పెరాను చిత్తు చేసింది. ఆధిపత్యాన్ని ప్రదర్శించిన జాబెర్ (ట్యునీసియా) మ్యాచ్‌లో ఎనిమిదిసార్లు ప్రత్యర్థి సర్వీసును బ్రేక్ చేసింది. ఆమె కూడా సర్వీసులో తడబడింది. అయితే 12 బ్రేక్‌పాయింట్లలో ఎనిమిదింటిని కాచుకుంది. మ్యాచ్‌లో జాబెర్ 16 విన్నర్లు కొట్టింది. పెరా 33 అనవసర తప్పిదాలు చేసింది. నిరుడు వింబుల్డన్, యుఎస్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన జాబెర్‌కు.. ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్‌ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి. ‘‘పెరా నా సర్వీసుపై చాలా ఒత్తిడి తెచ్చింది. కానీ అవసరమైనప్పుడు సర్వీసు నిలబెట్టుకున్నందుకు సంతోషంగా ఉంది. నా తర్వాతి మ్యాచ్‌లో మరింత మెరుగ్గా సర్వ్ చేస్తానని ఆశిస్తున్నా’’ అని మ్యాచ్ అనంతరం జాబెర్ వ్యాఖ్యానించింది. క్వార్టర్‌ఫైనల్లో ఆమె.. 14వ సీడ్ బెర్టిజ్ హదద్ మయా (బ్రెజిల్)ను ఢీకొంటుంది. ప్రిక్వార్టర్స్‌లో మయా 6-7 (3-7), 6-3, 7-5తో సారా సారిబెస్ (స్పెయిన్)పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మయా 65 విన్నర్లు కొట్టింది. రొలాండ్ గారోస్‌లో క్వార్టర్స్ చేరడం మయాకు కూడా ఇదే తొలిసారి. ఆరో సీడ్ కొకో గాఫ్ (అమెరికా) కూడా క్వార్టర్స్‌లో చోటు సంపాదించింది. నాలుగో రౌండ్లో ఆమె 7-5, 6-2తో ష్మీద్లోవా (స్లొవేకియా)పై విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో రెండో సీడ్ సబలెంక (బెలారస్) 7-6 (7-5), 6-4తో స్టీఫెన్స్ (అమెరికా)ను ఓడించి క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. పురుషుల సింగిల్స్‌లో నాలుగో సీడ్ రూడ్ (నార్వే) క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. నాలుగో రౌండ్లో అతడు 7-6 (7-3), 7-5, 7-5తో జారీ (చిలీ)ని ఓడించాడు. మ్యాచ్‌లో 10 ఏస్‌లు సంధించిన రూడ్.. 30 విన్నర్లు కొట్టాడు. జారీ గట్టి పోటీ ఇచ్చినా.. 67 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. ఆరో సీడ్ రూన్ (డెన్మార్క్) కూడా తుది ఎనిమిదిలో చోటు దక్కించుకున్నాడు. హోరాహోరీ మ్యాచ్‌లో అతడు 7-6 (7-3), 3-6, 6-4, 1-6, 7-6 (10-6)తో సెరుండొలో (అర్జెంటీనా)ను ఓడించాడు.మరో ప్రిక్వార్టర్స్‌లో అయిదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) 7-5, 6-3, 6-0తో ఆఫ్నర్ (ఆస్ట్రియా)ను మట్టికరిపించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
KL Rahul: కెప్టెన్సీ అంటే ఇష్టం.. ఇది నాకేం కొత్త కాదు: కేఎల్ రాహుల్
-
IRCTC tour package: ఒక్క రోజులోనే ఆంధ్రా ఊటీ అందాలు చూసొస్తారా?.. IRCTC టూర్ ప్యాకేజీ వివరాలు ఇవే..!
-
Koppula Harishwar Reddy: ప్రభుత్వ అధికార లాంఛనాలతో హరీశ్వర్ రెడ్డి అంత్యక్రియలు
-
Chandrababu Arrest : రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో చంద్రబాబు విచారణ ప్రారంభం
-
Kakinada: పామాయిల్ తోటలో విద్యుత్ తీగలు తగిలి.. ముగ్గురి మృతి
-
Justin Trudeau: ‘మేం ముందే ఈ విషయాన్ని భారత్‌కు చెప్పాం’: ఆగని ట్రూడో వ్యాఖ్యలు