సెమీస్‌లో జకోవిచ్
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ దూసుకెళ్తున్నాడు. పురుషుల సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచిన ఆటగాడిగా నిలిచే దిశగా మరో అడుగు ముందుకేశాడు.
సబలెంక, ముచోవా కూడా
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ దూసుకెళ్తున్నాడు. పురుషుల సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచిన ఆటగాడిగా నిలిచే దిశగా మరో అడుగు ముందుకేశాడు.
కచనోవ్‌ను మట్టికరిపిస్తూ అతను ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. మహిళల సింగిల్స్‌లో సబలెంక, ముచోవా తుది నాలుగులో చోటు సంపాదించారు.
టైటిల్ ఫేవరెట్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా) ఫ్రెంచ్ ఓపెన్ సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. మంగళవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో అతడు 4-6, 7-6 (7-0), 6-2, 6-4తో 11వ సీడ్ కచనోవ్ (రష్యా)పై విజయం సాధించాడు. 23వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై కన్నేసిన జకోవిచ్ అనూహ్యంగా తొలి సెట్‌ను కోల్పోయాడు. ఈ టోర్నీలో అతడు సెట్‌ను చేజార్చుకోవడం ఇదే మొదటిసారి. కానీ మూడో సీడ్ జకోవిచ్ ఆ తర్వాత బలంగా పుంజుకున్నాడు. రెండో సెట్ హోరాహోరీగా సాగింది. ఆటగాళ్లిద్దరూ సర్వీసులు నిలబెట్టుకుంటూ సాగడంతో సెట్ టైబ్రేక్‌కు దారితీసింది. అక్కడ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తూ సెట్‌ను చేజిక్కించుకున్న జకో.. అదే జోరు కొనసాగిస్తూ మూడో సెట్‌ను అలవోకగా చేజిక్కించుకున్నాడు. నాలుగో సెట్లోనూ అదరగొట్టాడు. మూడో గేమ్‌లోనే బ్రేక్ సాధించి విజయం దిశగా సాగాడు. కానీ కీలకమైన ఎనిమిదో గేమ్‌లో బ్రేక్ సాధించి, స్కోరును 4-4తో సమం చేయడం ద్వారా మ్యాచ్‌ను కచనోవ్ ఆసక్తికరంగా మార్చాడు. కానీ తర్వాతి గేమ్‌లోనే బ్రేక్ సాధించిన జకోవిచ్.. ఆ వెంటనే సర్వీసును నిలబెట్టుకుని సెట్‌ను, మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. మ్యాచ్‌లో 11 ఏస్‌లు సంధించిన జకోవిచ్.. 57 విన్నర్లు కొట్టాడు. నాలుగు బ్రేక్‌లు సాధించాడు. అతడు ప్రస్తుతం 22 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో నాదల్‌తో సమంగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రపంచ నంబర్‌వన్ అల్కరాస్ (స్పెయిన్), అయిదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) మధ్య క్వార్టర్స్ విజేతతో జకోవిచ్ సెమీఫైనల్లో తలపడతాడు.
సబలెంక ముందుకు: మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్ సబలెంక (బెలారస్), అన్‌సీడెడ్ ముచోవా (చెక్) సెమీఫైనల్‌కు దూసుకెళ్లారు. క్వార్టర్‌ఫైనల్లో సబలెంక 6-4, 6-4తో స్వితోలినా (ఉక్రెయిన్)పై విజయం సాధించింది. 30 విన్నర్లు కొట్టిన సబలెంక.. 9 బ్రేక్ పాయింట్లలో మూడింటిని సద్వినియోగం చేసుకుంది. రొలాండ్ గారోస్‌లో సెమీస్ చేరడం సబలెంకకు ఇదే తొలిసారి. ఫైనల్లో చోటు కోసం ఆమె ముచోవాతో తలపడుతుంది. క్వార్టర్‌ఫైనల్లో ముచోవా 7-5, 6-2తో మాజీ రన్నరప్ పవ్లిచెంకోవాను ఓడించింది. ముచోవాకు కూడా ఇక్కడ సెమీస్ చేరడం ఇదే మొదటిసారి. మ్యాచ్‌లో ముచోవా 21 విన్నర్లు కొట్టింది. అయిదుసార్లు ప్రత్యర్థి సర్వీసును బ్రేక్ చేసింది. 29 అనవసర తప్పిదాలు, 5 డబుల్ ఫాల్ట్‌లతో పవ్లించెంకోవా మూల్యం చెల్లించుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Hyderabad: సెల్‌ఫోన్ పోయిందని.. యువకుడి ఆత్మహత్య
-
S Jaishankar: జీ20 సారథ్యం ఆషామాషీ కాదు.. పెను సవాళ్లను ఎదుర్కొన్నాం: జైశంకర్
-
అవకాశం దొరికిన ప్రతిసారీ బ్రిజ్ భూషణ్ వేధింపులకు పాల్పడ్డాడు: దిల్లీ పోలీసులు
-
Vivek Agnihotri: నా సినిమాకు వ్యతిరేకంగా డబ్బులు పంచుతున్నారు: వివేక్ అగ్నిహోత్రి తీవ్ర ఆరోపణలు
-
Russia: పశ్చిమ దేశాలు నేరుగా రష్యాతో యుద్ధంలో ఉన్నాయి: సెర్గీ లవ్రోవ్
-
Motkupalli: జగన్.. నీ విధానాలు చూసి జనం నవ్వుకుంటున్నారు: మోత్కుపల్లి