సింధు నిష్క్రమణ.. ప్రిక్వార్టర్స్‌లో శ్రీకాంత్
భారత స్టార్ షట్లర్లు పి.వి.సింధు, హెచ్.ఎస్.ప్రణయ్ సింగపూర్ ఓపెన్ ప్రపంచ సూపర్ 750 టోర్నీలో తొలి రౌండ్లోనే నిష్క్రమించారు.
సింగపూర్: భారత స్టార్ షట్లర్లు పి.వి.సింధు, హెచ్.ఎస్.ప్రణయ్ సింగపూర్ ఓపెన్ ప్రపంచ సూపర్ 750 టోర్నీలో తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. మరో స్టార్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ ప్రిక్వార్టర్‌ఫైనల్ చేరాడు. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 21-18, 19-21, 17-21తో ప్రపంచ నంబర్‌వన్ అకానె యమగూచి (జపాన్) చేతిలో పోరాడి ఓడింది. సైనా నెహ్వాల్ 13-21, 15-21తో రచనోక్ (థాయ్‌లాండ్) చేతిలో పరాజయం పాలైంది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో శ్రీకాంత్ 21-15, 21-19తో కాంటాఫాన్ (థాయ్‌లాండ్)పై విజయం సాధించగా.. ప్రణయ్ 15-21, 19-21తో నరవొక చేతిలో, లక్ష్యసేన్ 21-18, 17-21, 13-21తో చౌ తీన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి పాలయ్యారు. ప్రియాంషు రజావత్ 21-12, 21-15తో సునెయామా (జపాన్)పై నెగ్గి ముందంజ వేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
ఎక్స్ ఇండియా హెడ్ రాజీనామా.. కారణమిదేనా?
-
Cricket News: సిరాజ్ స్పెషల్ అదేనన్న ఏబీడీ... జట్టుకు కాంబినేషనే కీలకమన్న షమీ!
-
Chandrababu Arrest: చంద్రబాబు విడుదలయ్యే వరకు దీక్ష కొనసాగిస్తా: కాలవ శ్రీనివాసులు
-
Vikasraj: అక్టోబరులో రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల బృందం: సీఈవో వికాస్ రాజ్
-
Gurpatwant Singh Pannun: పన్నూ వార్నింగ్ ఇస్తే.. కేంద్రం షాకిచ్చింది: ఆస్తులు స్వాధీనం చేసుకున్న ఎన్ఐఏ
-
politics: భాజపా - జేడీఎస్ పొత్తు.. ‘బెస్ట్ ఆఫ్ లక్’ అంటూ కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు