మేఘనకు స్వర్ణం

జూనియర్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌లో తెలంగాణ అమ్మాయి మేఘన సత్తా చాటింది. మహిళల 25 మీటర్ల పిస్టల్‌ టీమ్‌ విభాగంలో పాయల్‌, సిమ్రన్‌ప్రీత్‌ కౌర్‌తో కలిసి ఆమె స్వర్ణం కైవసం చేసుకుంది.

Published : 07 Jun 2023 03:22 IST

ప్రపంచకప్‌ షూటింగ్‌

జుల్‌ (జర్మనీ): జూనియర్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌లో తెలంగాణ అమ్మాయి మేఘన సత్తా చాటింది. మహిళల 25 మీటర్ల పిస్టల్‌ టీమ్‌ విభాగంలో పాయల్‌, సిమ్రన్‌ప్రీత్‌ కౌర్‌తో కలిసి ఆమె స్వర్ణం కైవసం చేసుకుంది. మేఘన బృందం 1719 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. వ్యక్తిగత విభాగంలోనూ మేఘన (22) రాణించినా కొద్దిలో పతకం కోల్పోయి నాలుగో స్థానంలో నిలిచింది. పాయల్‌ (18), దివ్యాంశి (11) అయిదు, ఏడో స్థానాలు సాధించారు. పురుషుల 25 మీటర్ల పిస్టల్‌ విభాగంలో అమన్‌ప్రీత్‌ సింగ్‌ (586) పసిడి సొంతం చేసుకున్నాడు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని