Asia Cup: ఆసియా కప్‌కు పాక్ దూరం?
ఆసియా కప్ నుంచి పాకిస్థాన్ వైదొలగనున్నట్లు తెలుస్తోంది. తాము ప్రతిపాదించిన హైబ్రిడ్ విధానాన్ని శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ వ్యతిరేకించడంతో ఆసియా కప్‌కు దూరంగా ఉండే విషయంలో పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మల్లగుల్లాలు పడుతోంది.
కరాచి: ఆసియా కప్ నుంచి పాకిస్థాన్ వైదొలగనున్నట్లు తెలుస్తోంది. తాము ప్రతిపాదించిన హైబ్రిడ్ విధానాన్ని శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ వ్యతిరేకించడంతో ఆసియా కప్‌కు దూరంగా ఉండే విషయంలో పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మల్లగుల్లాలు పడుతోంది. ఈ ఏడాది సెప్టెంబరులో ఆసియా కప్‌కు పాక్ ఆతిథ్యమివ్వాల్సింది. భద్రత కారణాల వల్ల పాక్‌లో పర్యటించేందుకు భారత్ నిరాకరించింది. దీంతో టీమ్‌ఇండియా మ్యాచ్‌ల్ని తటస్థ వేదికలో నిర్వహించేలా హైబ్రిడ్ విధానాన్ని పీసీబీ ప్రతిపాదించింది. కానీ.. టోర్నీని పాక్ నుంచి తరలించాలన్న బీసీసీఐ ఆలోచనకే శ్రీలంక, బంగ్లా, అఫ్గాన్‌లు మద్దతు తెలపడంతో పీసీబీ ఆశలు గల్లంతయ్యాయి. ‘‘పాక్ ముందు రెండే దారులు ఉన్నాయి. తటస్థ వేదికలో ఆడటం లేదా టోర్నీ నుంచి వైదొలగడం’’ అని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) వర్గాలు తెలిపాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sai Pallavi: రాముడిగా రణ్‌బీర్.. సీతగా సాయిపల్లవి ఫిక్స్!
-
IMA: ఆస్పత్రి డీన్‌తో టాయిలెట్లు కడిగిస్తారా? ఐఎంఏ హెచ్చరిక!
-
Nobel Prize: రసాయన శాస్త్రంలో నోబెల్ వీరికే.. ప్రకటనకు ముందే ‘లీకుల’ కలకలం..!
-
Harmilan Bains: 13 ఏళ్ల వయసులోనే నిషేధం... ఆపై వరుస గాయాలు.. హర్మిలన్ పోరాటమిదీ!
-
Meta: మెటాలో మరోసారి ఉద్యోగుల తొలగింపు..!
-
Rajeshwari Kumari: అప్పుడు తండ్రి.. ఇప్పుడు తనయ... రజత పతకధారి రాజేశ్వరి కథ ఇదీ!