బ్రిజ్‌భూషణ్‌ అనుచరుల వాంగ్మూలం నమోదు

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌సింగ్‌ కేసులో దిల్లీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Published : 07 Jun 2023 02:10 IST

దిల్లీ: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌సింగ్‌ కేసులో దిల్లీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మంగళవారం గోండా (ఉత్తర్‌ప్రదేశ్‌)లోని బ్రిజ్‌భూషణ్‌ నివాసంలో పనిచేస్తున్న అతని అనుచరుల వాంగ్మూలం నమోదు చేసినట్లు దిల్లీ పోలీసులు తెలిపారు. గతంలో పోక్సో చట్టం కింద రెజ్లర్‌ (బాలిక) వాంగ్మూలాన్ని నమోదు చేసిన దిల్లీ పోలీసులు.. సీఆర్‌పీసీ సెక్షన్‌ 164 ప్రకారం తాజాగా ఆమె స్టేట్‌మెంట్‌ రికార్డు చేసినట్లు పేర్కొన్నారు. కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలు సేకరిస్తున్నామని.. నివేదికను కోర్టుకు సమర్పిస్తామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని