ఆస్ట్రేలియా సహాయక కోచ్‌గా ఆండీ
భారత్‌తో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ముంగిట ఆస్ట్రేలియా జట్టు సహాయక కోచ్‌గా జింబాబ్వే మాజీ స్టార్ ఆండీ ఫ్లవర్ బాధ్యతలు స్వీకరించాడు.
లండన్: భారత్‌తో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ముంగిట ఆస్ట్రేలియా జట్టు సహాయక కోచ్‌గా జింబాబ్వే మాజీ స్టార్ ఆండీ ఫ్లవర్ బాధ్యతలు స్వీకరించాడు. గతంలో మూడుసార్లు యాషెస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన ఫ్లవర్.. ప్రస్తుతం ఐపీఎల్ ఫ్రాంఛైజీ లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌కు ప్రధాన కోచ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అయితే జూన్ 16న ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్ మొదలయ్యే నాటికి మాత్రమే అతడు కంగారూ బృందంలో చేరనున్నట్లు సమాచారం. 2001 తర్వాత ఇంగ్లాండ్‌లో యాషెస్ ట్రోఫీ గెలవలేకపోయిన ఆస్ట్రేలియా.. ఈసారి సత్తా చాటాలనే పట్టుదలతో ఉంది. ‘‘ఆండీ ఫ్లవర్‌కు ఎంతో అనుభవం ఉంది. ఇంగ్లాండ్‌లో పరిస్థితులపై పట్టుంది. అతడిచ్చే సలహాల వల్ల కచ్చితంగా ప్రయోజనం ఉంటుంది. కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ కూడా గతంలో ఆండీతో పని చేశాడు. అతడు మాతో చేరడం ఎంతో సంతోషంగా ఉంది’’ అని ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ చెప్పాడు.
సెలెక్షన్ ట్రయల్స్‌కే ప్రాధాన్యం: ఉష
సోన్‌పత్: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) ఎన్నికల నిర్వహణలో జాప్యాన్ని ఇండియన్ ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు పి.టి.ఉష సమర్థించుకుంది. జాతీయ సమాఖ్య ఎన్నికల కంటే రెజ్లర్ల సెలెక్షన్ ట్రయల్స్ ఎక్కువ ప్రాధాన్యమని తెలిపింది. డబ్ల్యూఎఫ్‌ఐ రోజువారీ కార్యకలాపాల నిర్వహణ బాధ్యతను ఏప్రిల్ 27న ముగ్గురు సభ్యుల అడ్‌హక్ కమిటీకి అప్పగించిన ఐఓఏ.. 45 రోజుల్లో ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొంది. ఈనెల 17న గడువు ముగియనుండగా.. అడ్‌హక్ కమిటీ ఆసియా ఛాంపియన్‌షిప్ కోసం అండర్-15, అండర్-20 సెలెక్షన్ ట్రయల్స్ కోసం ఏర్పాట్లు చేస్తుంది. ‘‘మన క్రీడాకారుల ప్రయోజనాల కోసం ఎన్నికల కంటే సెలెక్షన్స్‌కే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నాం. ఎన్నికలపై దృష్టిసారిస్తే సెలెక్షన్ ట్రయల్స్‌పై రాజీపడాల్సి వస్తుంది. ఎన్నికల తేదీల్ని త్వరలో ప్రకటిస్తాం’’ అని ఉష వివరించింది.
డబ్బంటే ఇష్టమే.. కానీ: స్టార్క్
లండన్: అంతర్జాతీయ కెరీర్‌ను పొడిగించుకునేందుకే ఐపీఎల్‌కు దూరంగా ఉంటున్నట్లు ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ అన్నాడు. ఐపీఎల్‌కు దూరంగా ఉండటంపై అతడు స్పందిస్తూ.. ‘‘ఆసీస్ తరఫున ఎక్కువ కాలం ఆడాలన్న ఉద్దేశంతో తెలివిగా కొన్ని పనులు చేయకూడదని నిర్ణయించుకున్నా. డబ్బంటే ఇష్టమే. కానీ 100 టెస్టులు ఆడాలని కోరుకుంటున్నా. అప్పటి వరకు జట్టులో ఉంటానో లేదో తెలియదు. ఆ మైలురాయిని అందుకుంటే గొప్పగా ఉంటుంది. నాలో ఇంకాస్త ఆట మిగిలే ఉందని భావిస్తున్నా’’ అని స్టార్క్ చెప్పాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Purandeswari: ఆర్థిక పరిస్థితిపై బుగ్గన చెప్పినవన్నీ అబద్ధాలే: పురందేశ్వరి
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Nara Brahmani: నారా బ్రాహ్మణితో సమావేశమైన జనసేన నేతలు
-
Sanju Samson: సంజూ శాంసన్ ఆ వైఖరిని మార్చుకోవాలి: శ్రీశాంత్
-
Hyderabad: సెల్‌ఫోన్ పోయిందని.. యువకుడి ఆత్మహత్య
-
S Jaishankar: జీ20 సారథ్యం ఆషామాషీ కాదు.. పెను సవాళ్లను ఎదుర్కొన్నాం: జైశంకర్