మళ్లీ టెస్టుల్లోకి మొయిన్‌ అలీ

ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ యాషెస్‌ సిరీస్‌ కోసం టెస్టు రిటైర్మెంట్‌ను వీడి జట్టుతో చేరనున్నాడు. 35 ఏళ్ల అలీ 2021లో భారత పర్యటన అనంతరం టెస్టులకు గుడ్‌బై చెప్పాడు.

Published : 08 Jun 2023 02:17 IST

లండన్‌: ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ యాషెస్‌ సిరీస్‌ కోసం టెస్టు రిటైర్మెంట్‌ను వీడి జట్టుతో చేరనున్నాడు. 35 ఏళ్ల అలీ 2021లో భారత పర్యటన అనంతరం టెస్టులకు గుడ్‌బై చెప్పాడు. కానీ ఇప్పుడు కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌, కోచ్‌ మెక్‌కలమ్‌ నచ్చచెప్పడంతో అతడు.. తిరిగి టెస్టు క్రికెట్‌ ఆడేందుకు అంగీకరించాడు. గాయం కారణంగా దూరమైన జాక్‌ లీచ్‌ స్థానంలో మొయిన్‌ అలీ.. అయిదు టెస్టుల యాషెస్‌ సిరీస్‌లో ఆస్ట్రేలియాతో తలపడే ఇంగ్లాండ్‌ జట్టులోకి వచ్చాడు. ‘‘మొయిన్‌ జట్టుతో చేరాలనే ఉత్సాహంతో ఉన్నాడు. అతడి అనుభవం, ఆల్‌రౌండ్‌ సామర్థ్యం యాషెస్‌లో మాకు ఎంతో ఉపయోగపడతాయి’’ అని ఇంగ్లాండ్‌ పురుషుల క్రికెట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాబ్‌ కీ ఓ ప్రకటనలో తెలిపాడు. 2023 ఐపీఎల్‌ ట్రోఫీ గెలిచిన చెన్నై సూపర్‌కింగ్స్‌లో అలీ సభ్యుడన్న సంగతి తెలిసిందే. అలీ ఇప్పటివరకు 64 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. యాషెస్‌ తొలి టెస్టు ఈ నెల 16న ఎడ్జ్‌బాస్టన్‌లో మొదలవుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని